Kalki 2898AD new release date: మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, వీడియో గ్లింప్స్ ఆడియెన్స్ ను ఓ రేంజ్ ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని, విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి అవ్వలేదని.. ఇలా ఏదో ఒక కారణం చెబుతూ సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. మే 09న మూవీని రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా రద్దయింది. సెన్సార్ పనులు పూర్తికాకపోవడంతో కల్కి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. ఈ మూవీని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. సెలవులు పూర్తయి స్కూళ్లు ఓపెన్ చేసే టైంలో రిలీజ్ చేయడం కలెక్షన్స్ ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 



Also Read: Nikki Tamboli HOT Show: బోల్డ్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ


ఇదిలా ఉంటే మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలను పట్టాలెక్కిస్తున్నాడు. కల్కితోపాటు పలు ప్రాజెక్టులు డార్లింగ్ చేతిలో ఉన్నాయి. సలార్ 2, రాజాసాబ్ వంటి మూవీ షూటింగ్‌ల‌తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న రాజాసాబ్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గానే ఈ మూవీ సెట్ లోకి హీరోయిన్ నిధి అగర్వాల్ అడుగుపెట్టింది. ప్రభాస్, నిధి మధ్య సాంగ్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. 


Also Read: Samantha Assets: సమంత ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా.. ? షాక్‌ ఇస్తున్న సామ్ అసెట్స్ వాల్యూస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి