కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దేశం.. ఆ దేశం అని మినహాయింపు లేకుండా ప్రపంచదేశాలన్నీ కరోనా బారినపడుతున్నాయి. వైరస్ ఆధారిత జబ్బు కావడంతో ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా కరోనావైరస్‌కి చేరువ చేస్తోంది. తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ హాంక్స్, ఆయన భార్య ప్రముఖ నటి రిటా విల్సన్‌కి కరోనావైరస్ పాజిటివ్ అని తేలినట్టు స్వయంగా టామ్ హాంక్స్ ప్రకటించాడు. ప్రముఖ హాలీవుడ్ ఫిలింమేకర్ బజ్ లుర్మన్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లింది. అక్కడే కాస్త అనారోగ్యంగా ఉన్నట్టు అనిపించడంతో హెల్త్ టెస్ట్ చేయించుకోగా కరోనా వైరస్ పాటిజివ్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారని టామ్ ట్విటర్ ద్వారా అభిమానులకు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"183074","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఒంటి నొప్పులు, జలుబు, తలనొప్పితో బాధపడుతుండటంతో పాటు విపరీతమైన అలసట అనిపించడం వల్లే తమకు అనుమానం వచ్చిందని టామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.



హాలీవుడ్‌లో 'కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్'గా పేరొందిన ప్రముఖ నటుడు, గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా టామ్, అతడి భార్య రిటా కరోనా బారినపడ్డారు. దీంతో ప్రస్తుతానికి ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ షూటింగ్ సైతం నిలిచిపోయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..