Netflix Top 10 Movies: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఓటీటీ వేదికలకు ఆదరణ భారీగా పెరిగింది. మరోవైపు విభిన్న కధాంశాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో విడుదలైన నెలరోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వేదిక బాగా ప్రాచుర్యం సంపాదించింది. అందుకే చాలవరకూ సినిమాలు ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. హాట్‌స్టార్, జీ 5, సోనీ, ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇలా చాలానే ఉన్నాయి. చిన్న బడ్జెట్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు భారీ బడ్జెట్ కూడా ఇందులోనే రిలీజవుతున్నాయి. విభిన్న కథాంశాలతో ఉండటంతో ప్రేక్షకులకు కూడా ఓటీటీ మంచి ప్రత్యామ్నాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రముఖ ఓటీటీ వేదికల్లో చెప్పుకోదగ్గది నెట్‌ఫ్లిక్స్. మంచి మంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) ఇటీవల అంటే విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే అత్యధిక వ్యూస్ సంపాదించిన టాప్ 10 మూవీస్ ఏంటనేది తెలుసుకుందాం.


1. రెడ్ నోటీస్ - నవంబర్ 4, 2021 న విడుదలై..129 మిలియన్ వ్యూస్ సాధించింది
2. ఎక్స్‌ట్రాక్షన్ - 2020 ఏప్రిల్ 24 న విడుదలై..99 మిలియన్ వ్యూస్ సంపాదించింది.
3. బర్డ్‌బాక్స్ - 2018 డిసెంబర్ 14 విడుదలై 89 మిలియన్ వ్యూస్ సంపాదించింది.
4. స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్ - 2020 మార్చ్ 6వ తేదీన విడుదలై 85 మిలియన్ల వ్యూస్ సాధించింది.
5. అండర్ గ్రౌండ్ - 2019 డిసెంబర్ 10వ తేదీన విడుదలై 83 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
6. మర్డర్ మిస్టరీ - 2019 జూన్ 14 విడుదలై 83 మిలియన్ల మందిని ఆకర్షించింది.
7. ది ఓల్డ్ గార్డ్ - 2020 జూలై 10 న విడుదలై 78 మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
8. ప్రాజెక్టు పవర్ - 2020 ఆగస్టు 14 న విడుదలై..75 మిలియన్ల వ్యూస్ సాధించింది..
9. ఎనోలా హోమ్స్ - 2020 సెప్టెంబర్ 30 న విడుదలై..76 మిలియన్ల వ్యూస్ సాధించింది.
10. ఆర్మీ ఆఫ్ ది డెడ్ - 2021 మార్చ్ 21 విడుదలై 75 మిలియన్ల వ్యూస్ సాధించింది.


Also read: Sridevi Remuneration: మెగాస్టార్ చిరంజీవితో సమానంగా పారితోషికం తీసుకున్న నటి ఎవరు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook