9 Re-release Telugu Movies with day 1 collections: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న వ్యవహారం అందరం చూస్తూనే ఉన్నాం. హీరోల పుట్టినరోజు లేదా సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఆయా సినిమాల క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీ రిలీజ్ సినిమాలు ఎంత వసూళ్లు చేస్తున్నాయి అనే విషయం మీద ఒకసారి లుక్ వేద్దాం. అంతేకాక ఇప్పటివరకు 9 సినిమాలను రీ రిలీజ్ చేయగా అత్యధిక కలెక్షన్లు ఏ సినిమాలు రాబట్టే అనేది కూడా పరిశీలిద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1: సింహాద్రి 
యూఎస్ఏలో రీ-రిలీజ్ సినిమాల్లో సింహాద్రి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 1000+ షోలతో 5 కోట్లకు పైగా వసూలు చేసింది. 
సింహాద్రి డే 1 ప్రపంచవ్యాప్త గ్రాస్: 5.2 కోట్లు షోలు: 1000+


2: ఖుషీ
ఖుషీ రీ రిలీజ్ లో 4 కోట్లకు పైగా వసూలు చేసింది. ఖుషి డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 4.15 కోట్లు కలెక్ట్ చేసింది. 
షోలు: 700+


3: జల్సా
ప్రపంచవ్యాప్తంగా 600 షోలకు రీ రిలీజ్ అయిన జల్సా 3 కోట్లకు పైగా వసూలు చేసింది.
జల్సా డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 3.20 కోట్లు


4: ఒక్కడు
మహేష్ బాబుతోనే రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. రీ-రిలీజ్‌ల ట్రెండ్‌సెట్టర్ మహేష్ బాబు అని చెప్పవచ్చు. ఇక అలా ఒక్కడు డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 2.1 కోట్లు కలెక్ట్ చేసింది. 
షోలు: 600+


Also Read: Sarath Babu Died: టాలీవుడ్లో విషాదం.. శరత్ బాబు కన్నుమూత


5: పోకిరి
అప్పట్లో తెలుగు చిత్రసీమలో ఉన్న ప్రతి రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. ఇది రీ-రిలీజ్‌లో 1.5 కోట్లకు పైగా వసూలు చేసింది.
పోకిరి డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 1.7 కోట్లు


6: ఆరెంజ్ 
గతంలో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయినా ఇప్పుడు రీరిలీజ్‌లో భారీ హిట్ అందుకుంది, రీరిలీజ్‌లో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించిన తీరు ఒక మ్యాజిక్. 
ఆరెంజ్ డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 1.6 కోట్లు


7: దేశముదురు
ఐకాన్ స్టార్ స్టైలిష్ ఎంటర్టైనర్ దేశముదురు రీ-రిలీజ్లో భారీ వసూళ్లు రాబట్టింది. 
దేశముదురు డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 1.50 కోట్లు


8: చెన్నకేశవ రెడ్డి
ప్రతి నందమూరి అభిమాని గర్వపడే సినిమా చెన్నకేశవ రెడ్డి డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 1.10 కోట్లు కలెక్ట్ చేసింది. 


9: బిల్లా
స్టైలిష్ డాన్ బిల్లా రీ-రిలీజ్‌లో బాక్సాఫీస్‌ను కైవసం చేసుకున్నాడు. బిల్లా డే 1 ప్రపంచవ్యాప్తంగా గ్రాస్: 1.5 కోట్లు వసూలు చేసింది. 


Also Read: Top 7 Telugu Movies: నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైంలో టాప్ 7 తెలుగు సినిమాలివే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook