Top Gear Director ప్రస్తుతం కొత్త కథలతో వచ్చే చిత్రాలు మ్యాజిక్ చేస్తున్నాయి. రొటీన్ కమర్షియల్ చిత్రాలు ఆడుతున్నా కూడా కంటెంట్ బేస్డ్ చిత్రాలు జనాలను ఆట్రాక్ట్ చేస్తున్నాయి. అలాంటి డిఫరెంట్ జానర్‌లో, విభిన్న కథాంశంతో టాప్ గేర్ అంటూ వచ్చాడు దర్శకుడు కె. శశికాంత్. ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన టాప్ గేర్ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాబ్ డ్రైవర్ అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడం, అందులోంచి బయటకు వచ్చేందుకు, తన భార్యను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నంలో ఎదురయ్యే సంఘటనలు ఇలా అన్నీ కూడా జనాలను సీటు అంచును కూర్చోబెట్టేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కథను నెరేట్ చేసిన విధానం , గ్రిప్పింగ్ గా స్టోరీని నడిపిస్తూ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు కె. శశికాంత్. 


టాప్ గేర్ మూవీ టేకింగ్ విషయంలో దర్శకుడు అయితే పాస్ అయ్యాడు. మొత్తానికి మొదటి సినిమాతో అందరి దృష్టిలో పడ్డ శశికాంత్ ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. శశికాంత్ ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రముఖ హీరోతో శశికాంత్ నెక్స్ట్ సినిమా తెరకెక్కనుంది. 


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయని టాక్. టాప్ గేర్ లాగే మరో డిఫరెంట్ పాయింట్ తీసుకొని స్టోరీ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్టు సమాచారం అందుతోంది.


Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?


Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook