Tragedies in Chalapathi Rao Life: చలపతిరావు అనూహ్యంగా కార్డియాక్ అరెస్ట్ అయి కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుమారు 1200 కు పైగా సినిమాల్లో నటుడిగా ఆయన కనిపించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా అనేక వందల సినిమాల్లో నటించిన ఆయన కొంతకాలంగా వయోభారం రీత్యా ఇంటికే పరిమితమయ్యారు. పూర్తిగా సినిమాలకు దూరమై రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆయన కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడం తీవ్ర విషాధాన్ని నింపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చలపతిరావు జీవితంలో అనేక విషాద సంఘటనలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అసలు విషయం ఏమిటంటే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కుటుంబానికి కూడా తెలియకుండా ఒక అమ్మాయి తనను ఇష్ట పడింది అనే కారణంతో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరువాత కాలంలో కుటుంబాన్ని కూడా ఒప్పించుకున్నారు. అయితే అనారోగ్యంతో చలపతిరావు భార్య పెళ్లైనా కొద్ది సంవత్సరాలకే మరణించారు.


కానీ ఆమె మరణించే సమయానికి రవిబాబు వయసు ఏడేళ్లు మాత్రమే. ఆ తర్వాత చలపతిరావు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన మాత్రం మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు. తన సంతానమే తన ఆస్తిగా భావించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారని చెబుతూ ఉంటారు సన్నిహితులు. తన తండ్రి చలపతిరావు పెళ్లి చేయాలని రవిబాబు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ చలపతిరావు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదట.


మా నాన్నకు పెళ్లి అనే సినిమా లాగానే రవిబాబు కూడా అనేక సంబంధాలు చలపతిరావు కోసం తీసుకువచ్చినా అన్నీటిని ఆయన దూరం పెట్టే వారని చెబుతుంటారు. అయితే ఎప్పుడూ పైకి సరదాగా కనిపిస్తూ లేదా గంభీరంగా కనిపిస్తూ ఉండే చలపతిరావు జీవితంలో అనేక విషాద ఘటనలు ఉన్నాయి. సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఆయన ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాదాపు 8 నెలలపాటు చక్రాల కుర్చీకే చలపతిరావు పరిమితమయ్యారు.


ఆ సమయంలోనే కంటి చూపు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అలాంటి నటుడు ఇంటికి పరిమితం అవ్వకూడదు అనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను ఆయనను వినయవిధేయ రామ సినిమా కోసం ఆయనని ఒక పాత్ర కోసం రోప్ చేశారు. చక్రాల కుర్చీలో ఉండగానే ఇక్కడి నుంచి బ్యాంకాక్ తీసుకువెళ్లి మరి షూటింగ్ చేయించినట్టు అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చలపతిరావు చెప్పుకొచ్చారు.


ఇక ఒకానొక సందర్భంలో చలపతిరావు సూసైడ్ కూడా చేసుకుని చనిపోవాలని భావించారట, ఆ మధ్య ఒక ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి చలపతిరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. సోషల్ మీడియాలో ఆయన మీద తీవ్రమైన నెగెటివిటీ రావడమే గాక అలాంటివాడు బతికి ఉండడం ఎందుకు అంటూ కూడా నెగిటివ్ ట్రోలింగ్ జరగడంతో చనిపోవాలని కూడా అనుకున్నారట. తర్వాత కుమారుడి మాటలతో, మోటివేషన్తో ఆయన ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది.


Also Read: Chalapathi Rao Death: టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు చలపతి రావు మృతి!


Also Read: Tunisha Sharma Suicide: సహనటుడి మేకప్ రూంలో 20 ఏళ్ల సినీ నటి సూసైడ్.. అసలు ఏమైందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.