Manthena Murali Raju Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనమామ, బాలీవుడ్ నిర్మాత మురళీరాజు కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 70 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మురళీ రాజు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని మధుర నగర్ నివాసంలో ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం ప్రాంతానికి చెందిన మురళి రాజు నిర్మాతగా గతంలో కొన్ని సినిమాలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఆయన చేసిన సినిమాల నిర్మాణ పనులను మురళి రాజు స్వయంగా చూసుకునేవారు. అయితే సినిమాల నిర్మాణాన్ని పక్కన పెట్టిన తర్వాత కూడా ఆయన పలు వ్యాపారాలు చేశారు. మురళీ రాజుకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉండగా ఆయన కుమారుడు మధు మంతెన కూడా బాలీవుడ్ లో నిర్మాతగా ఫేమస్. మధు మంతెన నిర్మాతగా అనేక బాలీవుడ్ సినిమాలు చేశారు. ఆయన నిర్మించిన వాటిలో గజినీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు పలు ఇతర సినిమాలు కూడా ఉన్నాయి.


ఆయన కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగు, తమిళ భాషల్లో కూడా కలిపి మొత్తం 34 సినిమాలు చేశారు. ఇక మురళి రాజు మృతిపై సినీ రాజకీయ ప్రముఖులందరూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివ దేహానికి నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్షకుడు క్రిష్, గీత ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వంటి వారు కూడా నివాళులర్పించారు.


హైదరాబాదులో మధుర నగర్ ప్రాంతంలో మురళీ రాజు నివాసం ఉంటున్నారు. ఇక సినీ రాజకీయ వీరంతా కూడా అదే ప్రాంతానికి వచ్చి ఆయనని చివరి సారిగా చూసుకొని నివాళులర్పించారు. మధు మంతెనతో కలిసి బాలీవుడ్ లో మహా భారతం అనే ఒక ప్రాజెక్టు చేయడానికి అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా కాలం నుంచి దీనికి సంబంధించిన పనులు అయితే జరుగుతూ వస్తున్నాయి.


Also Read: Priyanka Chopra Photos: లో దుస్తులు లేకుండా ప్రియాంక పరువాల విందు.. నెవర్ బిఫోర్ అనిపించే అందాల జాతర!


Also Read: Shruti Haasan Hot Pics: శృతి హాసన్ బోల్డ్ షో.. ఆ యాంగిల్స్ చూశారంటే 'అబ్బ' అనాల్సిందే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి