BiggBoss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు 5లో పింకీ అలియాస్ ప్రియాంక జర్నీ ముగిసింది. అందరిలో ప్రత్యేకత నిలుపుకున్న పింకీ భారంగానే హౌస్ నుంచి నిష్క్రమించింది. 13 వారాల జర్నీలో ఎంత సంపాదించిందనే లెక్కలేస్తున్నారు అభిమానులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో(BiggBoss Telugu Season 5) ప్రియాంక సింగ్ ప్రత్యేకమైన కంటెస్టెంట్. ట్రాన్స్‌జెండర్‌గా అందరి మనసుల్ని దోచుకున్న పింకీ 13 వారాలు దిగ్విజయంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు వెళ్లిపోతుందనుకున్న పింకీ..టాప్ 7 వరకూ కొనసాగింది. టాప్ 5లో ఉంటుందని భావించినా..13వ వారం నిష్క్రమించింది. అందరికీ వంట చేసి పెడుతూ..చేయూతగా నిలిచిన పింకీ..అందం..ఆటతీరుతో ఆకట్టుకుంది. బిగ్‌బాస్ షో నుంచి నిష్క్రమిస్తూ మానస్ విషయంలో చాలా బాధపడినట్టు కన్పించింది. ఆవేదనను ఆపుకోలేక ఏడ్చేసింది. టాప్ 5లో నిల్వలేకపోయాననే బాధ ఉంటుందని చెప్పింది.


13 వారాల్లో బిగ్‌బాస్ ద్వారా పింకీ అలియాస్ ప్రియాంక సింగ్(Priyanka Singh)ఎంత సంపాదించి ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించిన పింకీ నిష్క్రమణ(Pinky Elimination) హౌస్‌లోనే కాకుండా అభిమానులందరికీ నిరాశ మిగిల్చింది. పింకీకు వారానికి 2 లక్షల వరకూ బిగ్‌బాస్ నిర్వాహకులు(Pinky Remuneration) చెల్లించేందుకు ఒప్పందమైనట్టు తెలుస్తోంది. అంటే మొత్తం 13 వారాలకు 25 లక్షల వరకూ సంపాదించినట్టుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. సెలెబ్రిటీ లేదా కంటెస్టెంట్ స్థాయిని బట్టి బిగ్‌బాస్‌లో వారానికి ఇంత అని చెల్లిస్తుంటారు. 12వ వారం ఎలిమినేట్ అయిన యాంకర్ రవి(Anchor Ravi)..పింకీ కంటే ఎక్కువే సంపాదించినట్టు సమాచారం


Also read: Pushpa Trailer: పుష్ప ట్రైలర్ కోసం తగ్గెదేలే అంటున్న Allu Arjun fans