RRR Movie Team Viral Video: కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందునుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వస్తున్న ఈ చిత్రయూనిట్.. దీపావళి రోజున ఫొటోషూట్‌తో.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్.. అర్థరాత్రి షూటింగ్‌కి సంబంధించిన మరో వీడియోను ట్విట్టర్ వేదిక ద్వారా పంచుకుంది. ఈ వీడియలో రాజమౌళి, ఎన్టీఆర్ సైతం కనిపించారు. Also read: Ananya Panday: న్యూ స్టిల్స్‌తో మైమరిపిస్తున్న ‘ఫైటర్’ బ్యూటీ అనన్య



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే చలికాలంలో టీమ్ పరిస్థితి గురించి ఉదహరిస్తూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ పంచుకున్న వీడియోలో అందరూ వణికిపోతూ.. వేడి మంటల వద్ద చలికాచుకుంటున్నారు. దీంతోపాటు సెట్‌లో హీటర్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ టీమ్ మొత్తం చలికాచుకుంటుంది. అయితే ఈ వీడియోలో రాజమోళి ‘‘రేపటి నుంచి నీళ్లల్లోకి.. అంటూ నవ్వుతూ కనిపించగా.. జూ. ఎన్టీఆర్ సైతం హీటర్ దగ్గర నిలబడ్డారు. ఎదీఏమైనా.. ఎన్ని చలిగాలులు వీచినా.. మా చిత్ర బృందం మాత్రం ధృడనిశ్చయంతో ముందుకుసాగుతుంది అంటూ.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ వీడియోను పంచుకోగా.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also read: Seerat kapoor: సీరత్ కపూర్ స్టన్నింగ్ ఫొటోలు..


Also read: Allu Arjun: అభిమానితో ఫొటోలు దిగిన పుష్పరాజ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి