Pavithra Jayaram Dies in Car Accident: సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. అనేక సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించింది. ఈరోజు తెల్లవారి జామున మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పవిత్ర జయరాం స్వస్థలం కర్ణాటకలోని ఒక గ్రామం. నిన్న కర్ణాటక కి వెళ్లిన పవిత్ర జయరాం ఈరోజు ఉదయం తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. తాను వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‏ను ఢీ కొట్టి ఆ తర్వాత కుడివైపున వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది అన్ని సమాచారం. ఈ ఘటనలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే మరణించింది. ఆమెతోపాటు కారులో తన తోటి నటులు, కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ కార్ ఆక్సిడెంట్ లో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, తోటి నటుడు చంద్రకాంత్ కు తీవ్రమైన గాయాలు అయినట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే అక్కడ ఉన్న  పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పవిత్ర జయరామ్ ని మాత్రం కాపాడలేకపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


కాగా కన్నడలో అనేక సీరియల్స్ చేసిన పవిత్ర జయరామ్.. తెలుగులో ఆమె చేసిన త్రినయని సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్లో విలన్ పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకుంది. కన్నడ రోబో ఫ్యామిలీ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టిన పవిత్ర… మాండ్య తాలూకాలోని హనకెరెకు చెందినవారు. ప్రస్తుతం ఈమె తెలుగులో త్రినయని సీరియల్లో తిలోత్తమ పాత్రలో నటిస్తుంది.


Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter