Trivikram Mahesh Babu : SSMB 28 అప్డేట్.. అన్నీ మార్చినా పూజా హెగ్డేను మాత్రం మార్చని గురూజీ
Trivikram Mahesh Babu Movie త్రివిక్రమ్ మహేష్ బాబు మూడో ప్రాజెక్ట్ మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నో తర్జనభర్జనల తరువాత ఈ ప్రాజెక్ట్ మీద ఓ క్లారిటీ వచ్చింది.
Pooja Hegde in SSMB 28 Project : మహేష్ బాబు త్రివిక్రమ్ మూడో ప్రాజెక్ట్ మీద రకరకాల రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో గానీ ముందు అనుకున్న కథను పూర్తిగా లేపేశారు. కథ, కథనాలను మార్చేశారు. ఇది వరకు తీసిన యాక్షన్ సీక్వెన్స్‌ను పక్కన పెట్టేశారు. తమిళ స్టంట్ మాస్టర్లు అన్బరివ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ ఖర్చు దాదాపు ఏడు ఎనిమిది కోట్లు. చివరకు అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయింది.
ఆ ఫైట్ సీక్వెన్స్‌ను మళ్లీ కొత్త కథలో ఇరికించొచ్చా? అని చాలానే ప్రయత్నించారట. కానీ ఎక్కడా సెట్ అవ్వకపోవడంతో పక్కన పడేశారని టాక్. అయితే ఇది వరకు రాసుకున్న కథలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ అన్నారు.. ఇప్పుడు చెబుతున్న ప్రాజెక్ట్ మాత్రం ఎంటర్టైన్మెంట్ అని అంటున్నారు. ఇది పక్కా త్రివిక్రమ్ శైలి మాటలతోనే సాగేట్టు కనిపిస్తోంది. అయితే కథ పూర్తిగా మారింది.. ఈ మేరకు సిట్టింగ్స్ కూడా భారీగానే జరిగాయి.
మహేష్ బాబు త్రివిక్రమ్ తమన్ నిర్మాత నాగవంశీ చినబాబు అందరూ కలిసి సిట్టింగ్స్ వేశారు. కథ మొత్తం మారింది.. కానీ హీరోయిన్ మాత్రం పూజా హెగ్డేనే. అసలే సోషల్ మీడియాలో త్రివిక్రమ్, పూజా హెగ్డేల మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ అందరికీ తెలిసిందే. వరుసగా త్రివికమ్ తన సినిమాల్లో పూజా హెగ్డేనే పెట్టుకుంటున్నాడు. దీంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్, మీమ్స్ వేసి గురూజీని ఆడేసుకుంటున్నారు.
అయితే మహేష్ బాబుతో మహర్షి తరువాత పూజా హెగ్డే రెండో సారి జత కట్టేస్తోందన్న మాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ ముందు కాస్త సందిగ్దత నెలకొంది. కానీ చివరకు మళ్లీ తమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టేసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అవుతుందని మేకర్లు ప్రకటించేశారు.
Also Read : Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు
Also Read : Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook