Trivikram Cooking: ఇంట్లో వంట త్రివిక్రమే చేస్తాడా.. అరెరే ఇలా బయట పెట్టేశాడు ఏంటి?
Trivikram Cooking at home: తాను నైట్స్ ఇంట్లో వంట చేస్తాను అంటూ ఆసక్తికర విషయం బయట పెట్టాడు మతాల మాంత్రికుడు త్రివిక్రమ్, సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.
Trivikram Cooking at home: సాధారణంగా త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆయన ప్రస్తుతం దర్శకుడుగా మారి అనేక సూపర్ హిట్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో మహేష్ 28వ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయినా సరే హారిక హాసిని, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద తెరకెక్కుతున్న అన్ని సినిమాల విషయాల్లోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్/వాత్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈవెంట్ కి హాజరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడిన మాటల కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా మాట్లాడుతూ సార్ సినిమా హీరోయిన్ సంయుక్త మీనన్ కి ఐ లవ్ యు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఈలలతో గోల చేశారు. దీంతో వెంటనే ఆయన కంగారుపడుతూ నేను చెప్పేది మొత్తం వినండి రా బాబు అన్నట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత నేను మా ఆవిడకి కూడా చెబుతాను నువ్వు అడిగావని అంటూ సంయుక్త మీద తన భార్యను గురించి అడిగినట్లుగా ఆయన కామెంట్ చేశారు. అంతేకాక సాధారణంగా రాత్రి వంట నేనే చేస్తాను అని కానీ ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడంతో ఆ వంట చేసేందుకు ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని అన్నారు.
కాబట్టి ఆమె ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోయింది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పూట ఇంట్లో వంట చేస్తారా అంటూ నెటిజన్లు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అందులో కొంతమంది భార్యకు సహాయపడుతూ ఒక పూట వంట చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే మరి కొంతమంది మాత్రం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈయన వంట చేస్తున్నాడంటే ఇది చాలా గొప్ప విషయమే అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Janhvi Kapoor for NTR 30: ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్..ఫోటోషూట్ కూడా పూర్తి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook