Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
Amala Akkineni on Dog Attack అమల అక్కినేని తాజాగా అంబర్ పేట్ కుక్కల దాడి మీద స్పందించినట్టుగా తెలుస్తోంది. ఒక కుక్క అలా చేసిందని, అన్ని కుక్కల మీద కోపం పెంచుకుంటారా? అని అమల నిలదీసినట్టుగా టాక్.
Amala Akkineni on Dog Attack అంబర్ పేట్‌లో నాలుగేళ్లు బాలుడు ప్రదీప్ మీద వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. ఆ దాడికి సంబంధించిన విజువల్స్ చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఇంత దారుణమా? అని అనుకుంటారు. అయితే ఈ దాడి మీద సమాజం రెండు రకాలుగా స్పందించింది. కుక్కలను ద్వేషించే వారు ఒకలా స్పందిస్తూ.. డాగ్ లవర్స్ ఇంకోలా స్పందిస్తున్నారు. దీంతో రష్మీ గౌతమ్ అందరికీ టార్గెట్ అయింది. జంతు ప్రేమికురాలైన యాంకర్ రష్మీ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిపై చేసిన కామెంట్లతో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది.
అయితే తాజాగా అమల అక్కినేని కూడా అంబర్ పేట్ ఇష్యూ మీద స్పందించినట్టుగా తెలుస్తోంది. ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షిస్తామా?.. ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మానవ జాతిని శిక్షిస్తున్నామా? మరి ఒక కుక్క చేసిన పనికి అన్నింటినీ శిక్షిస్తామా? కుక్కలు ఎప్పుడూ మనషులను ప్రేమిస్తూనే ఉంటాయి.. అవి మనల్ని రక్షిస్తుంటాయి.. అని అమల చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మేరకు వచ్చిన పోస్టును సురేఖా వాణి కూతురు సుప్రిత షేర్ చేసింది. సురేఖా వాణి, సుప్రితలు కూడా డాగ్ లవర్స్ అన్న సంగతి తెలిసిందే. వీరి ఇంట్లోనూ ఓ కుక్క ఉందన్న సంగతి తెలిసిందే. ఆ పెట్‌కు వారు బర్త్ డేలు కూడా గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేస్తుంటారు. ఇప్పుడు అమల అన్నట్టుగా వస్తోన్న ఈ వార్తలను సుప్రిత షేర్ చేసింది.
[[{"fid":"263951","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇక ఈ విషయం మీద రామ్ గోపాల్ గత కొన్ని రోజులుగా చేస్తోన్న ట్వీట్లు అందరికీ తెలిసిందే. ఈ కుక్కల వల్ల మరణించిన చిన్నారి ప్రదీప్‌కు న్యాయం జరగాల్సిందే అని, డాగ్ లవర్ అయిన హైద్రాబాద్ మేయర్‌ను కడిగిపాడేస్తున్నాడు ఆర్జీవీ. అయితే ఆర్జీవీ మాటలను జనాలు అంగీకరిస్తున్నారు.. మద్దతుగా నిలుస్తున్నారు. కానీ ప్రభుత్వం అసలు పట్టించుకుంటున్నట్టుగా కనిపించడం లేదు.
హైద్రబాద్‌లో కుక్కల స్వైర విహారం ఎక్కువ అయింది. రోజుకో చోట ఇలా కుక్కల దాడిలో చిన్న పిల్లలు గాయాలపాలవుతున్నారు. కుక్కలను కంట్రోల్ చేయాలని జీహెచ్‌ఎంసీకి వందలు, వేల వినతులు వస్తున్నా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అయితే అమల ఆ కామెంట్లను ఎక్కడ చేసిందనే విషయం మీద క్లారిటీ రావడం లేదు.
Also Read: Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook