Truth Behind Mahesh Babu Wig: సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారు జీవితాలలో ఎలాంటి కార్లు వాడుతున్నారు? ఎలాంటి వస్తువులు వాడుతున్నారు? ఎలాంటి బట్టలు ధరిస్తున్నారు? వారు ధరిస్తున్న బట్టల ఖరీదు ఎంత? వారి ధరిస్తున్న వాచీలు ఏవి? వాడుతున్న ఫోన్ల ఖరీదు ఎంత? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అదేవిధంగా వారి జుట్టు ఒరిజినల్ జుట్టేనా? లేక విగ్గులు వాడుతున్నారా? అనే విషయం మీద కూడా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మహేష్ బాబు విగ్గు వాడుతున్నారా? లేక అది ఒరిజినల్ జుట్టేనా? అని అనుమానం చాలా మందికి ఉంటుంది. ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్ కృష్ణకు మేకప్ మ్యాన్ గా పని చేసిన చేబ్రోలు మాధవరావు అనే వ్యక్తి. ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అనూహ్య పరిస్థితుల్లో మరణించడంతో ఆయనకు సుదీర్ఘ కాలం మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తిని అనేక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి.


ఈ సందర్భంగా కృష్ణ జుట్టు ఒరిజినల్ జుట్టేనా? లేక విగ్గా? అని అడిగితే చాలా కాలం పాటు ఒరిజినల్ జుట్టుతోనే ఆయన సినిమాలు చేస్తూ వెళ్లారని తర్వాత జుట్టు పలుచన అవ్వడంతో విగ్గు వాడడం మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు జుట్టు గురించి కూడా ఆమె ప్రశ్నిస్తే మొదట్లో మహేష్ బాబు విగ్గు లేకుండానే ఉండేవారని అయితే తర్వాత ఆయన చుట్టూ కూడా పలుచన అవ్వడంతో ఆయన కూడా విగ్గు వాడడం మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు.


అయితే నిజానికి మహేష్ బాబు ఫస్ట్ లో ఎలాంటి విగ్గులు వాడకుండానే నటించేవారు తర్వాత కాలంలో ఆయన జుట్టు రాలడం మొదలైన తర్వాత విగ్గులు వాడడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తర్వాత అయినా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నట్లు సమాచారం. క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ అనే ఒక అత్యాధునిక హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ టెక్నాలజీ ద్వారా మహేష్ తల మీద జుట్టు ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నారు.


ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం నాన్ సర్జికల్ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం అని తెలుస్తోంది. ఈ జుట్టు చూడటానికి సహజమైన జుట్టు లాగానే అనిపిస్తుందట. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టంని బాలీవుడ్ హీరోలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు ఈ పద్ధతి ఫాలో అవుతూ ఉంటారని చెబుతున్నారు.


Also Read: Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్‌ కోసం ఇలానా?


Also Read: Priyanka Jawalkar SIzzling Photos: తెలుగమ్మాయి ప్రియాంక పరువాల విందు.. వైట్ డ్రెస్ లో దేవకన్యలా వలపువల!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook