Nagachaitanya Meeting Samantha: దక్షిణ కొరియా నుంచి రాగానే సమంత దగ్గరకు చైతూ.. అసలు విషయం అదేనా?
Nagachaitanya Meeting Samantha : దక్షిణ కొరియాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత అక్కడి నుంచి తిరిగిరాగానే ఆమెను నాగచైతన్య కలిసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Truth Behind Nagachaitanya Meeting Samantha after Returning From South Korea: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల యశోద అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె ఆ సినిమా రిలీజ్ కావడానికి అంటే ముందే తాను మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాననే విషయాన్ని బయట పెట్టింది. ఇక ఈ వ్యాధి ప్రస్తుతం థర్డ్ స్టేజ్ లో ఉన్నట్లు ఆ తర్వాత కల్పిక గణేష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ అరుదైన వ్యాధి కోసం ఇన్నాళ్లపాటు ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన సమంత ఈ మధ్యనే ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
కానీ ఆ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇక్కడ ఈ వ్యాధికి దొరికే ట్రీట్మెంట్ కంటే దక్షిణ కొరియాలో దొరికే ట్రీట్మెంట్ వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో సమంతా హుటాహుటిన అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి దక్షిణ కొరియాలోనే సమంత ట్రీట్మెంట్ కొనసాగుతుందని ఆమె సన్నిహితుల నుంచి సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అది ఈ విషయం మీద కూడా క్లారిటీ లేదు, అయితే సమంత దక్షిణ కొరియా నుంచి రాగానే నాగచైతన్య ఆమె ఇంటికి వెళ్లి పర్సనల్గా కలిసి ఆమె హెల్త్ గురించి మాట్లాడుతారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నాగచైతన్య స్నేహితులు సైతం ఈ విషయాన్ని ఖరారు చేశారంటూ ఈ ప్రచారం సాగుతుండగా అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనే విషయం మీద కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. నిజానికి చాలా రోజుల నుంచి సమంత నాగచైతన్య మధ్య దూరం అలానే ఉంది. అయితే సమంత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా దూరంగా ఉండటం మంచిది కాదని నాగచైతన్యకు కొంతమంది సన్నిహితులు సూచించారని, ఈ నేపథ్యంలోనే ఆయన సమంతను పరామర్శించేందుకు వెళ్లడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం మేరకు అది నిజం కాదని తెలుస్తోంది.
సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన నాగచైతన్య కూడా బాధపడ్డారని అయితే ఇక మీదట దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న నేపథ్యంలో మళ్లీ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె బాధ పెట్టే ఉద్దేశం నాగచైతన్యకు లేదని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం అంతా ఒట్టిదే అని అంటున్నారు. అయితే వారిద్దరి అభిమానులు మాత్రం కలిస్తే బాగుండు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Waltair Veerayya: మెగాస్టార్ సంచలన నిర్ణయం.. 'సింహ'న్ని ఫాలో అవుతూ ఎంట్రీ!
Also Read: Prabhas Sister: నానికి వదిన అంటే నమ్మారు.. ప్రభాస్ కు అక్క అంటే నమ్ముతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook