Nagarjuna trying to Cancel Naga chaitanya - Samantha Divorce: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తాను ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నానని చెబుతూ అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆ ప్రకటన చేసినప్పటి నుంచి ఆమె అనారోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు మీద చర్చ జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి వంటి వారు సైతం ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే ఇంత జరిగినా ఆమె మాజీ భర్త నాగచైతన్య నుంచి గాని నాగార్జున కుటుంబం నుంచి గాని ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేకపోవడం మీద సమంత అభిమానులు మండిపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదంతా ఒక ఎత్తు అయితే నాగ చైతన్య ఆమెను హాస్పిటల్ కి వెళ్లి ఓదార్చడని ఒక వార్త, లేదు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని నేనున్నానని అభయం ఇచ్చాడని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడైతే ఏకంగా నాగార్జున నాగచైతన్య సమంత విడాకులు కూడా రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ప్రచారం జరుగుతోంది. తన మాజీ భార్యను అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయిన నాగచైతన్య ఆమెను ఓదార్చి ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విడాకులు రద్దు చేసుకోవాలని నాకే చైతన్యకు నాగార్జున సూచనలు చేశారని ఇలాంటి పరిస్థితుల్లో నీ తోడు అవసరం ఆమె మనసుకు దగ్గరైన వాడివి నువ్వే కాబట్టి ఆమెకు తోడుగా ఉండాలని చెప్పాడంటూ ప్రచారం జరుగుతోంది.


అయితే సమంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఇదంతా ఒట్టి ప్రచారమే అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే నాగచైతన్య నుంచి కానీ నాగార్జున కుటుంబం నుంచి కానీ ఎలాంటి పరామర్శ లేదని బహుశా ఫోన్ లో పరామర్శించి ఉండవచ్చు కానీ నేరుగా ఇంటికి వచ్చి పరామర్శించిన దాఖలాలు లేవని వారు వెల్లడించారు. ఇక ఈ విడాకుల రద్దు అనేది అయితే పూర్తి సత్యదూరం అని అంటున్నారు. ఒక ప్రస్తుతానికి సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఆమె నేరుగా ప్రమోషన్స్ లో పాల్గొని పరిస్థితి కాబట్టి యాంకర్ సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పటికే షూట్ చేశారు. దాన్ని ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


నవంబర్ 11వ తేదీన ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూతో పాటు సమంత పలు నేషనల్ మీడియా ఛానల్స్ కి కూడా ఆఫ్లైన్ ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సమంత ప్రధాన పాత్రలో రూపొందిన యశోద సినిమాని ఇద్దరు దర్శకులు తెరకెక్కించారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే పది రెట్లు పెరిగినా సమంత మార్కెట్ మీద ఉన్న నమ్మకంతో తాను ఎక్కడా వెనక్కి తగ్గలేదని తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
Also Read: VD in Brahmastra 2: బ్రహ్మాస్త్ర 2లో కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండ.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే!


Also Read: Shankar with Ranveer Singh: అపరిచితుడు రీమేక్ పక్కన పెట్టి బాహుబలి లాంటి ప్లానింగ్ లో శంకర్ !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook