No Entry for Balakrishna in Annapurna Studios: నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు అనేక వివాదాలకు కారణం అవుతున్నాయి. అక్కినేని తొక్కినేని అంటూ ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో అక్కినేని అభిమానులు పెద్ద ఎత్తున ఆయన మీద ఫైర్ అవుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ తీసుకువచ్చి మద్రాసు నుంచి తెలుగు సినీ పరిశ్రమము ఇక్కడ స్థాపించి ముందుకు వెళ్లడానికి పాటుపడిన మహానుభావుడు అక్కినేని గురించి నీచాతి నీచంగా కామెంట్ చేయడం ఏమీ బాలేదని ఈ విషయం మీద కనుక తక్షణమే స్పందించి క్షమాపణలు చెప్పకపోతే బాధపడే విధంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇదే విషయం మీద అక్కినేని నాగచైతన్య సహా అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. నందమూరి తారక రామారావు గారు ఎస్ వి రంగారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు ముద్దుబిడ్డలు అలాంటి వాళ్ళను కించపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టే అని పేర్కొన్నారు. ఇక తాజాగా ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది.


అదేమిటంటే నందమూరి బాలకృష్ణని అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం లోపలికి అనుమతించడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ ఆహా లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ఒక టాక్ షో చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెకండ్ సీజన్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే రేపు ఒక ఎపిసోడ్ షూటింగ్ ఉందని ఆ షూటింగ్ నిమిత్తం నందమూరి బాలకృష్ణ రేపు రావాల్సి ఉండగా మేము బాలకృష్ణను లోపలికి రానివ్వం అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ఆహా టీంకి ఒక మెసేజ్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.


అయితే ఈ వార్త అయితే నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ టు పదవ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ గెస్ట్ తో టెలికాస్ట్ అవుతుంది. మూడో సీజన్ ప్రారంభించడానికి కాస్త సమయం పడుతుంది, ఇప్పట్లో బాలకృష్ణ ఆహా షూట్ కోసం అయితే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో ఇది ఎవరో సృష్టించిన వార్త అని తెలుస్తోంది, అయితే ఈ విషయం మీద అధికారిక సమాచారం అయితే అందాల్సి ఉంది.


Also Read: Akkineni Fans: మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పండి!


Also Read: Veera Simha Reddy Day 12 : ఎట్టకేలకు హిట్ కొట్టేసిన బాలయ్య.. లాభం ఎంత అంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook