Taraka ratna Kids Name : తారకరత్న బిడ్డల పేర్ల వెనుకున్న రహస్యం ఏంటో తెలుసా?.. తాత అంటే అంత ఇష్టం మరి!
Taraka ratna Kids Name నందమూరి వంశానికి ఎన్టీఆర్ అనేది పునాది. ఆ పునాది మీదే నందమూరి హీరోలంతా నిలబడ్డారు. నాన్న, తాత అంటూ నందమూరి హీరోలు జపం చేస్తుంటారు. తన తాత మీదున్న ప్రేమతోనే తారకరత్న సైతం తన బిడ్డల పేర్లు పెట్టుకున్నాడు.
Taraka ratna Kids Name నందమూరి వంశంలో పేర్లు చాలా కొత్తగా అనిపిస్తాయి. ఒకే ఫార్మాట్‌ను ఫాలో అవుతుంటారు. మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ అంటూ ఇలా స్వర్గీయ నందమూరి తారకరామారావు తన కొడుకుల పేర్లు పెట్టాడు. హరికృష్ణ అయితే తన కొడుకుల పేర్లను జానకీరామ్, కళ్యాణ్ రామ్ అంటూ పేర్లు పెట్టాడు. జూ.ఎన్టీఆర్ పేరును స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన సంగతి తెలిసిందే.
జూ.ఎన్టీఆర్ సైతం తన కొడుకుల పేర్లను అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లుగా నామకరణం చేశాడు. అయితే తారకరత్న సైతం తన బిడ్డల పేర్లను తాతకు జ్ఞాపకార్థంగా పెట్టేసుకున్నాడు. నిషిక (N), తనయ్ రామ్ (T), రెయా (R) అని పేర్లు పెట్టుకున్నాడు. NTR అని కలిసి వచ్చేలా తారకరత్న తన బిడ్డలకు ఇలా పేర్లు పెట్టుకుని తాత మీద ప్రేమను చాటుకున్నాడు.
నందమూరి ఇప్పటి తరం హీరోల్లో బాలయ్యకు అతి సన్నిహితంగా ఉండేది మాత్రం తారకరత్నయే. బాలయ్యకు ఎన్టీఆర్‌కు మధ్య దూరం ఉందన్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్‌తోనూ- బాలయ్య బాగానే ఉంటాడు. కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్‌లు ఇప్పుడు జంటగా కనిపిస్తున్నారు.
బాలయ్య ఇప్పుడు తారకరత్న ఫ్యామిలీని చూసుకునే బాధ్యతను భుజాన వేసుకున్నాడట. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. బాలయ్య నిజంగా గ్రేట్ అని, తారకరత్న ఫ్యామిలీ తన బాధ్యత అని హామీ ఇచ్చాడంటూ విజయసాయి రెడ్డి నిన్న మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే.
తారకరత్న పార్థివ దేహాన్ని నేడు ఫిలిం చాంబర్‌లో ఉంచారు. టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నేటి సాయంత్రం మహా ప్రస్థానంలో ఆయన అంత్య క్రియలు జరగనున్నాయి. తారకరత్న మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook