Tunisha Sharma Suicide Case Update: హిందీ టీవీ నటి తునీషా శర్మ శనివారం నాడు తాను నటిస్తున్న సీరియల్ సెట్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నటి తునీషా శర్మ మరణించినప్పటి నుండి, ఆమె ఆత్మహత్య గురించి అనేక కొత్త విషయాలు తెరమీదకు వస్తున్నాయి. ఇక ఆమె చనిపోవడానికి ఒక రోజు ముందు నటి తునీషా  ఆత్మహత్యకు తన సహనటుడు షీజన్‌ ప్రోత్సహించాడని తునీషా తల్లి ఆరోపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో పోలీసులు జీషాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపరచగా, కోర్టు జిషాన్‌ను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. 20 ఏళ్ల చురుకైన యువతి తునీషా ఈ విధంగా లోకాన్ని విడిచిపెట్టడంతో అందరూ షాక్ కు గురి అవుతున్నారు. తునీషా స్నేహితులు సహా ఆమె కుటుంబ సభ్యులు నటి తునీషా ఇక లేరు అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.


మీడియా నివేదికల ప్రకారం, తునీషా అనేక కలలు కనేది, తునీషా  కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఆమె ఇప్పటి నుంచి అనేక ప్రణాళికలు కూడా వేసుకుంది అంటున్నారు. తునీషా ప్రేమను నమ్మింది అని దాని కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు ఆమె సిద్ధమైందని అంటున్నారు. తన మరణానికి 12 వారాల ముందు, తునీషా తన మణికట్టుపై 'లవ్ ఎబోవ్ ఎవ్రీ థింగ్’ అంటే అన్నింటికంటే ప్రేమనే ఎక్కవుగా అంటూ టాటూ వేయించుకుంది.


దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తునీషా ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది - బకెట్ లిస్ట్ లో టాటూ వేయించుకోవడం పూర్తయింది, ధన్యవాదాలు, నాకు ఇది చాలా నచ్చిందని అంటూ కామెంట్ చేసింది. తునీషా ప్రేమపై చాలా నమ్మకం పెంచుకుందని, ప్రేమను దేవుని కంటే ఎక్కువగా భావించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


ఇక కొన్ని రోజుల తర్వాత జనవరి 21న తునీషా తన 21వ పుట్టినరోజును జరుపుకోవాల్సి ఉంది. యైతే అనుహ్యంగా పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందు, నటి తునీషా ప్రపంచానికి వీడ్కోలు పలికింది. ఆమె సినిమాల విషయానికి వస్తే సీరియల్స్ కాకుండా, తునీషా ఫితూర్ సహా బార్ బార్ దేఖో చిత్రాలలో యువ కత్రినా కైఫ్ పాత్రను పోషించింది. విద్యాబాలన్ 'కహానీ 2'లో కూడా ఆమె నటించింది. 


Also Read: Mahesh Babu's : మహేష్ బాబు జాతకం వల్లనే వరుస మరణాలు.. అసలు విషయం చెప్పిన వేణుస్వామి!


Also Read: Nabha Natesh Hot Photos: పొట్టిబట్టల్లో నభా నటేష్ హాట్ ట్రీట్..ఒక రేంజ్లో రెచ్చిపోయిందిగా!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.