Deepika Pilli Dhee Show బుల్లితెరపై దీపిక పిల్లి కొన్ని రోజులే హంగామా చేసింది. ఢీ షోలో ఆది, రష్మీ, దీపిక ఇలా అందరూ కలిసి సందడి చేశారు. దీపిక పిల్లి ఒకే ఒక్క సీజన్‌లో కనిపించింది. ఆ తరువాత ఢీ నుంచి తప్పుకుంది. ఆ తరువాత కామెడీ స్టార్స్ షోలో సోలో యాంకర్‌గా కొన్ని రోజులు హవా కొనసాగించింది. అయితే ఇప్పుడు దీపిక పిల్లికి ఏదో చేదు అనుభవం ఎదురైనట్టుగా కనిపిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టుగా అనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాకు ఈ రోజు ఎంతో కష్టంగా గడిచింది.. అనుకోకుండా కొన్ని ఘటనలు జరిగాయి.. కానీ దాని ప్రభావం నా మీద చాలా గట్టిగా ఉంది.. మన ఆలోచనల వల్లే మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది.. ప్రశాంతంగా ఉండటమే ముఖ్యమని ఇప్పుడు తెలుసుకున్నాను.. మనకు ఏం జరిగింది.. ఏం జరుగుతోందనేది ముఖ్యం కాదు.. వర్తమానంలో బతుకుతున్నామా? ప్రజెంట్‌లో ఉంటున్నామా? అన్నదే ముఖ్యం.


[[{"fid":"272382","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇంకా దీని గురించి వివరంగా చెప్పలేను.. కానీ వర్తమానం గురించి ఆలోచించడమనేది ముఖ్యం అంటూ దీపిక పిల్లి చెప్పుకొచ్చింది. దీపిక పిల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో యాంకర్ రష్మీతో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. వీకెండ్ వస్తే పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతుంటారు. ఈ మధ్య దీపిక పిల్లి బర్త్ డేను కూడా ఆమె ఫ్రెండ్స్ అంతా కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే.


Also Read:  Ananya Nagalla : అనన్య తడి అందాలు.. చూస్తే వామ్మో అనాల్సిందే.. అందరి ఫోకస్ అక్కడే


ఇక సిల్వర్ స్క్రీన్ మీద కూడా దీపిక పిల్లి తన సత్తాను చాటాలని అనుకుంది. వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో దీపిక పిల్లి కనిపించింది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమాలో దీపిక పిల్లి తన అందాలను బాగానే ప్రదర్శించింది. అయితే దీపిక పిల్లికి మాత్రం ఆ సినిమా ఏ కోణంలోనూ ఉపయోగపడలేదనిపిస్తుంది. మళ్లీ ఇంత వరకు కొత్త ప్రాజెక్ట్‌ను ఆమె పట్టుకోలేకపోయినట్టు కనిపిస్తోంది.


Also Read:  Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook