Unstoppable Nani episode Promo: అన్‌స్టాపబుల్ అంటూ ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై బాలయ్య బాబు తొలిసారిగా చేస్తోన్న టాక్ షోకు భారీ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్‌లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి అతిథులుగా రాగా తాజాగా రెండో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్‌లో న్యాచురల్ స్టార్ నానిని గెస్ట్‌గా చూడొచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకొచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాని అంటే ఇష్టపడని వాళ్లుండరు. ఇదే పాయింట్‌ని హైలైట్ చేస్తూ బాలయ్య బాబు న్యాచురల్ స్టార్ నానికి స్వాగతం పలకడం ఆడియెన్స్ ఈ ప్రోమోలో చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ? బాలకృష్ణ, నానిల అన్‌స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ ప్రోమో (Balakrishna Unstoppable with Nani episode Promo) మీరు కూడా చూసేయండి.



 


నాని పర్సనల్ లైఫ్‌లో ఇప్పటివరకు అభిమానులకు, ఆడియెన్స్‌కి తెలియని నిజాలు, పర్సనల్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే.. ఈ టాక్ షోతో అవి బయటికి వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. నవంబర్ 4న దీపావళి నాడు మోహన్ బాబు ఎపిసోడ్ (Unstoppable with Mohan Babu episode) ప్రసారం కాగా వారం రోజుల వ్యవధితో నవంబర్ 12న నానితో అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ ప్రీమియర్ (Balakrishna, Nani's Unstoppable episode date and time) కానుంది. నాని షేర్ చేసుకోబోయే ఆ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఏంటో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.