Balakrishna Unstoppable : మంచు ఫ్యామిలీతో బాలకృష్ణ సందడి..ప్రోమో మామూలుగా లేదుగా
Balakrishna Mohan Babus Unstoppable: షోలో ఫస్ట్ ఎపిసోడే అదిరిపోతుంది అనిపిస్తోంది. మోహన్ బాబు.. (Mohan Babu) బాలకృష్ణల (Balakrishna) మధ్య సంభాషణ.. ఇద్దరూ ఒకరిపై ఒకరు సంధించిన ప్రశ్నలు.. సమాధానాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.
Balakrishna Mohan Babus Unstoppable With NBK Episode 1 Promo out now: నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీనే అదిరిపోయింది. బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా నెవర్ బిఫోర్ అనేలా సెలబ్రిటీ టాక్ షో ప్లాన్ చేసింది ‘ఆహా’ టీమ్. ‘మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అంటూ ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ (Unstoppable With NBK ) షో తో సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతున్నామంటూ బాలయ్య బాబు ప్రోమోతోనే (Promo) అందరినీ ఆకట్టుకున్నారు.
బాలకృష్ణ షో కి సెలబ్రిటీలు ఎవరెవరు రాబోతున్నారని నెట్టింట బోలెడన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ సస్పెన్స్‌కి తెరదించుతూ ఆదివారం ఉదయం ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో (Unstoppable With NBK Episode 1 Promo) వచ్చేసింది.విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కలెక్షన్ కింగ్... మంచు మోహన్ బాబు ఈ షోకు ఫస్ట్ గెస్ట్‌గా వచ్చారు.
Also Read : Sardar Patel birth anniversary: సర్ధార్ పటేల్ 146వ జయంతి నేడు- మోదీ నివాళులు..
నందమూరి తారక రామారావు నుంచి నందమూరి ఫ్యామిలీతో మోహన్ బాబుకి ఎంతో అనుబంధం ఉంది. ఇక ఈ షో లో ఆయనతో పాటు కుమార్తె మంచు లక్ష్మీ, (Manchu Lakshmi) పెద్ద కుమారుడు ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manch Vishnu) పాల్గొన్నారు. ఇక మోహన్ బాబుతో కలిసి బాలయ్య మామూలుగా సందడి చెయ్యలేదు. ‘దంచవే మేనత్త కూతురా’ అంటూ మంచు లక్ష్మీతో స్టెప్పులేశారు బాలయ్య బాబు.
ఇక బాలయ్య గెటప్ (Balayya Getup) అదిరిపోయింది. రాయల్ లుక్‌లో ఉన్న నటసింహం లుక్ అదిరిపోయింది. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, సెట్స్, ప్రాపర్టీస్ దగ్గరినుండి ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటూ బాలయ్య టాక్ షో (Balayya talk show) నెవర్ బిఫోర్ అనేలా రూపొందించింది ఆహా టీమ్.
ఇక షోలో ఫస్ట్ ఎపిసోడే అదిరిపోతుంది అనిపిస్తోంది. మోహన్ బాబు.. (Mohan Babu) బాలకృష్ణల (Balakrishna) మధ్య సంభాషణ.. ఇద్దరూ ఒకరిపై ఒకరు సంధించిన ప్రశ్నలు.. సమాధానాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రోమో చివర్లో ‘అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఫినిషింగ్ ఇచ్చి అలరించారు.దీపావళి కానుకగా నవంబర్ 4 నుంచి ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’ ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతోంది.
Also Read : Niloufer Hospital: హైదరాద్ లో దారుణం.. రూ.100 కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డ్ బాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి