Unstoppable Season 4 Episode 7 Promo: నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా.. హోస్ట్ గా సందడి చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ మూడు సీజన్లు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 4 లో 7 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాయి. 8వ ఎపిసోడ్ లో బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకూ మహారాజ్’ టీమ్ సందడి చేయబోతుంది. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. తనకు సంబంధించిన టీమ్ మెంబర్స్ అయిన నిర్మాత నాగ వంశీ, దర్శకుడు బాబీ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ షోలో సందడి చేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా తమన్.. అఖండకు కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అప్పట్లో అమెరికాలో సౌండ్ కు  బాక్సులు తట్టుకోలేక బద్దలైపోయాయి. ఈ విషయాన్ని ఈ షోలో ప్రస్తావించారు. మరోవైపు ఈ షోలో బాబీ లవ్ స్టోరీని బాలయ్య ప్రస్తావించారు. ఇక ఊర్వశి రౌతెల గురించి నాగ వంశీని బాలయ్య ప్రశ్న సంధిస్తే.. ఆ సమాధానం చెబితే.. తన భార్యతో తనకు విడాకులే అంటూ నవ్వులు పూయించాడు.  ఈ ఎపిసోడ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోన్ లో పలకరించడం వంటివి ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి.




‘డాకూ మహారాజ్’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణ.. డాకూ పాత్రలో నటించారు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉండనే ఉంది. ఇప్పటికే ఈ సీజన్ లో విడుదలైన మెజారిటీ చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొత్తంగా ఈ ఫుల్  ఎపిసోడ్ జనవరి 3న  రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ రానుంది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.