Unstoppable Season 4: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఏడో ఎపిసోడ్ లో వెంకీ మామ సందడి చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కంప్లీటైంది. అంతేకాదు వీరిద్దరు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో బాలయ్య.. డాకూ మహారాజ్ గా వస్తుంటే.. వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికే వస్తున్నారు. ఈ రకంగా వీళ్లిద్దరు బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఈ సందర్భంగా విడుదలైన ప్రోమోలో ఇద్దరు లెజండరీ హీరోలు చేసిన హంగామా మాములుగా లేదు. వీరిద్దరు నిజ జీవితంలో మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ ప్రోమోలో అది వ్యక్తం అయింది. ఒకరి సినిమాల గురించి మరొకరు ఆసక్తిగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్, బాలయ్యలు ఇద్దరు పోటాపోటీగా కాళు కాళ్లు వేసుకొని పెట్టిన ఫోజులకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అది బాలయ్య బాబు అని వెంకీ అంటే.. అది వెంకీ బాబు ఇదే అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు ఆహూతులను అలరించాయి.  


ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో దిగిన ఫోటోలను ఈ షోలో ప్రదర్శించారు. ఈ సందర్బంగా చెన్నైలో తమ పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా తన మేనల్లుడు నాగార్జున కుమారుడైన నాగ చైతన్యతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను వివరించారు. అంతేకాదు తన ముగ్గురు కూతుళ్లు గురించి ఈ షోలో ప్రస్తావించారు వెంకీ మామ.



ఈ షోలో వెంకటేష్ వాళ్ల అన్న సురేశ్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంత అందంగా ఉండి కూడా ఎందుకు హీరో ఎందుకు కాలేదు అని అడిగారు. మరోవైపు వెంకటేష్.. తన అన్నను చూసి అప్పట్లో అందరు కమల్ హాసన్ అనే వారనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మరోవైపు తండ్రి రామానాయుడు గురించి అడగ్గానే కాస్తంత ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు ప్రజలకు ఎంత చేసినా.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారని తెలుసుకొని రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయాన్ని సురేష్ బాబు ప్రస్తావించారు. మొత్తంగా ఈ ఫుల్  ఎపిసోడ్ ఈ నెల 27న రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ రానుంది.


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.