మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. 'ఉప్పెన' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాట విడుదల చేశారు.  ఈ రెండూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  'నీ కళ్లు నీలి సముద్రం' అంటూ శ్రీమణి రాసిన గీతం చాలా బాగా అలరిస్తోంది. ఇప్పటికే ఈ పాటను కోటి మంది వీక్షించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


'ఉప్పెన' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మరో మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ ను వెండి తెరకు పరిచయం చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ నుంచి సినిమా వస్తోంది. ఈ సినిమాకు కథా రచన, దర్శకత్వం బుచ్చిబాబు సాన వహిస్తున్నారు.  


Read Also: 'కరోనా వైరస్' గురించి భయపడాల్సిన అవసరం లేదు..!! 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..