మెగా ఫ్యామిలీ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. గతేడాదే విడుదల కావాల్సి ఉన్న ఈ ఉప్పెన మూవీ లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. షూటింగ్ పార్ట్ పూర్తయినప్పటికీ... మెగాస్టార్ మేనల్లుడు తొలి పరిచయం అవుతున్న సినిమా కావడంతో ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో కాకుండా డైరెక్ట్ థియేటర్స్‌లోనే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉప్పెన నిర్మాతలు వేచిచూశారు. ఇక ఉప్పెన సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో తాజాగా నిర్మాతలు ఉప్పెన టీజర్‌ని విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఉప్పెన టీజర్ మెగా అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తున్న కృతిశెట్టి ( Kriti Shetty ) కూడా ఈ సినిమా ద్వారానే తొలి పరిచయం అవుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ( DSP music ) కంపోజ్ చేసిన ఉప్పెన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ‘నీ కన్ను నీలి సముద్రం’ ( Nee kannu neeli Samudram song ) పాటకు ఇప్పటికే భారీ స్పందన లభించింది యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. రెండవ పాట ‘ధక్ ధక్ ధక్’ సాంగ్ ( Dhak Dhak dhak song ) కూడా సంగీత ప్రియులకు బాగా నచ్చింది.


Also read : Singer Sunitha honeymoon plans: సింగర్ సునీత హనీమూన్ ప్లాన్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook