Uppena Trailer: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు Vaishnav Tej ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. లాక్‌డౌన్ కంటే ముందుగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. మెగా అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న ఉప్పెన సినిమాను ఫిబ్రవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఉప్పెన ట్రైలర్‌ను విడుదల చేశారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉప్పెన ట్రైలర్‌కి మెగా అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. Kriti Shetty కూడా ఈ సినిమా ద్వారానే తొలి పరిచయం అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో తమిళ నటుడు Vijay Sethupathi విలనిజం బాగా హైలైట్ అయినట్టు Uppena trailer చూస్తే అర్థమవుతోంది. 


Also read : Uppena teaser: ఆకట్టుకుంటున్న ఉప్పెన మూవీ టీజర్


దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఉప్పెన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా Nee kannu neeli Samudram song కు మ్యూజిక్ లవర్స్ నుంచి విశేషమైన స్పందన కనిపించింది. ఇక సినిమా ఎలా ఉందో తెలియాలంటే Uppena release date ఫిబ్రవరి 12 వరకు వేచిచూడాల్సిందే. ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో కాకుండా డైరెక్ట్ థియేటర్స్‌లోనే విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉప్పెన నిర్మాతలు వేచిచూశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook