COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Urfi Javed And Sofia Ansari: ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియా కూడా దూసుకుపోతోంది. ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియా ద్వారా జీరో నుంచి హీరోలు అవుతున్నారు. టిక్ టాక్, స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి ప్రస్తుతం చాలామంది లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కోట్లలో సంపాదిస్తున్నారని ఇటీవలే కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిచ్చే ఉర్ఫీ జావేద్, సోఫియా అన్సారీ వంటి ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తున్నారనేది చాలామందిలో ఆసక్తి కలిగించే ప్రశ్న..అయితే ఈ రోజు ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం మనం తెలుసుకోబోతున్నాం.


సోఫియా అన్సారీ విషయానికొస్తే..మనం తరచుగా ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఆమెకు సంబంధించిన రీల్సే దర్శనమిస్తూ ఉంటాయి. చిన్న చిన్న బికినీలు వేసుకొని నిత్యం రీల్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సోఫియా ప్లాట్ ఫామ్‌లో వచ్చే సిరీస్‌లలో నటిస్తోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్‌లో 7.5 మంది మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా, కేవలం స్పాన్సర్‌షిప్ పై సంవత్సరానికి 80 నుంచి 90 లక్షల వరకు సంపాదించుతుందని సమాచారం..ఇవే కాకుండా ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా డబ్బులు వస్తున్నట్లు తెలుస్తోంది. 2023 సంవత్సరం నాటికి సోఫియా నికర ఆదాయం రూ.2 కోట్లకు పైగానే ఉంటున్నట్లు అంచనాలు..


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


ప్రస్తుతం ఉర్ఫీ జావేద్ భారతీయ టెలివిజన్ మోడలింగ్ రంగంలో టాప్ మోస్ట్ క్యాండిడేట్. ఆమె ఇప్పటికీ ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌లో నటించింది. దీంతోపాటు 2021 సంవత్సరంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా పాటిస్పేట్ చేసింది. ప్రస్తుతం ఉల్ఫీకి సోషల్ మీడియాలో ఉన్న మాస్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన ఉత్పత్తులను ప్రచారం చేస్తోంది. ఒక్కొక్క మోడలింగ్‌ బ్రాండ్‌ పోస్ట్‌కి 6 నుంచి 7 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. 2023 ప్రకారం..ఉర్ఫీ జావేద్ నెట్‌వర్త్‌ 21 మిలియన్ డాలర్లు కాగా..దీంతో పాటు అమెకు కొన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు సమాచారం.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి