Urfi Javed covering her body with a Breakfast Plate and Juice Glass: ఉర్ఫీ జావేద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు బాగా తెలుసు. ముఖ్యంగా వైరిటీ డ్రెసులతో సోషల్ మీడియాలో పెద్ద స్టార్ అయ్యారు. తన గ్లామర్‌తోనే ఎక్కువ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్‌ను ఉర్ఫీ సంపాదించుకుంటున్నారు. ఉర్ఫీ జావేద్ ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. ఓ వర్గం వారిని మాత్రం తన అంగాంగ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1997 అక్టోబర్ 15న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉర్ఫీ జావేద్ జన్మించారు. ఆమెకు అస్ఫీ జావేద్ అనే సోదరి ఉంది. సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన ఉర్ఫీ జావేద్.. అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందారు. చిన్నపటినుంచి మీకు నటన అంటే చాలా ఇష్టం. 2016లో సోనీ టీవీ ప్రసారం చేసిన 'బడే భయ్యా కి దుల్హనియా'లో అవనీ పంత్‌గా ఉర్ఫీ ఆలరించారు. బేపన్నా, పంచ్ బీట్, చంద్ర నందిని, సాత్ ఫేరో కి హెరా ఫెరీ,యే రిష్తా క్యా కెహ్లతా హై, కసౌతి జిందగీ కే సీరియల్స్ చేశారు. 


బిగ్ బాస్ ఓటిటీ మొదటి సీజన్‌లో ఉర్ఫీ జావేద్ పాల్గొన్నారు. ఆ షో నుంచి బయటికి వచ్చాక అమ్మడి ప్రతాపం ఏంటో జనాలకు తెలిసొచ్చింది. బిగ్ బాస్ ఓటిటీ అనంతరం ముంబై విమానాశ్రయంలో వెరైటీగా కనిపించారు. కత్తిరించిన డెనిమ్ టాప్, జీన్స్ ధరించి విమానాశ్రయం నుంచి బయటకు వెళ్తూ కెమెరాలకు చిక్కారు. అప్పటినుంచి ఉర్ఫీ జావేద్ నిత్యం వార్తలో ఉంటున్నారు. రోజుకో వెరైటీ డ్రెస్ వేస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ఉర్ఫీ జావేద్ స్కిన్ షోను కొందరు ఎంజాయ్ చేస్తే.. మరికొందరు మాత్రం మండిపడుతున్నారు.



దుస్తుల విషయంలో ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో బెదిరింపులు కూడా వస్తుంటాయి. అత్యాచారం చేసి హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి ఆమెకు వాట్సాప్‌లో బెదిరింపు మెసేజులు కూడా పంపాడు. అయినా కూడా అవేమీ తనకు పట్టనట్టు ఉంటారు ఉర్ఫీ. తాజాగా మరోసారి రెచ్చిపోయారు ఉర్ఫీ. ఈసారి ఏకంగా టాస్ లెస్‌గా దర్శమిచ్చారు. ఎద అందాలను ప్లేట్, గ్లాస్ అడ్డుపెట్టి దాచేశారు. బ్రేక్ ఫాస్ట్ చేస్తుండగా ఈ వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతొంది. ఈ వీడియోపై భిన్న స్పందనలు వస్తున్నాయి. 


Also Read: Sankranti Holidays: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఈసారి మూడు హాలిడేస్ మిస్!  


Also Read: Cheap Tata Nexon Cars: డెడ్ చీప్‌గా టాటా నెక్సాన్‌ కారు.. కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.