Urfi Javed Removes Saree: తన బట్టలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉండే టీవీ నటి ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఉర్ఫీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఆమె అసాధారణమైన ఫ్యాషన్‌ సెన్స్ ని చూసి, అలాంటి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయిరా బాబూ అంటూ ఆలోచనలో పడుతూ ఉంటారు సాధారణ జనం. ఇప్పుడు ఉర్ఫీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ఉర్ఫీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏమిటంటే ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక వీడియో అలాగే ఒక ఫోటో పంచుకున్నారు. అందులో ఉర్ఫీ కేవలం బ్లాక్ బ్రాలెట్ బ్లౌజ్ సహా కేవలం బ్లాక్ పెటికోట్ మాత్రమే ధరించి కనిపించడం మీరు చూడవచ్చు. అలాగే ఉర్ఫీ బ్రాలెట్ బ్లౌజ్ సహా పెట్టీకోట్‌లో ఇద్దరు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. నిజానికి ముందుగా ఉర్ఫీ నలుపు రంగు ట్రాన్స్ పరెంట్ చీరను ధరించింది. నిజానికి  ఉర్ఫీ జావేద్ ముంబైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్‌కు ఈ చీరలోనే హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు కూడా బయటపడ్డాయి. అయితే ఉర్ఫీ జావేద్ ఒక నైట్ పార్టీ కోసం చీరను తీసి డ్యాన్స్ చేయడంహాట్ టాపిక్ గా మారింది. తన చీరను తీసివేసి, తన పెట్టీకోట్‌ను స్కర్ట్‌గా చేసి స్నేహితురాళ్లతో ఆమె డ్యాన్స్ చేసింది. ఈవెంట్ తర్వాత, ఉర్ఫీ స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్లింది. అక్కడే ఆమె తన చీరను తీసి, పెట్టీకోట్ స్కర్ట్‌గా చేసి, ఆపై చాలా ఎంజాయ్ చేసింది. ఉర్ఫీ తన ఇన్‌స్టా స్టోరీలో ఈ విషయాన్ని ప్రస్తావించి, ఆమె స్నేహితులతో సరదాగా గడిపినట్టు వెల్లడించింది. 


Also Read: August Tollywood Releases: బింబిసార టు లైగర్.. ఆగస్టులో సందడి చేయనున్న తెలుగు సినిమాలివే!


Also Read: Nirmala Mishra: హార్ట్ ఎటాక్‌తో ప్రముఖ సింగర్ కన్నుమూత.. ఆసుపత్రికి తరలించారు కానీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook