Urfi Javed wears Pizza Made Top: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టించే ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన బోల్డ్ స్టైల్, బోల్డ్ ఫ్యాషన్‌తో నెటిజెన్స్ తల తిప్పుకోకుండా చేయడంలో ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఉర్ఫీ జావేద్ ది ట్రెండీ ఫ్యాషన్ అని చెప్పుకోవడం కంటే.. విచిత్రమైన ఫ్యాషన్ అని చెప్పుకోవడం కరెక్ట్. అవును.. వింత వింత దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులివ్వడం, వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్ షార్ట్స్‌లో పోస్ట్ చేస్తున్న కారణంగానే ఉర్ఫీ జావేద్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అందుకే ఆమె పోస్ట్ చేసే ప్రతీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేక మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఎద పై భాగంలో ఎలాంటి అచ్చాదన లేకుండా పిజ్జాలో పావు వంతులో కట్ చేసిన రెండు పిజ్జా ముక్కలను అటువైపు ఒకటి, ఇటు వైపు ఒకటి పెట్టుకుని, వాటినే ఒక బ్రా తరహాలో ధరించి ఉర్ఫీ జావేద్ ఇచ్చిన ఫోజులకు కుర్రకారు నిషా ఎక్కిపోతున్నారు. ఇదేంట్రా బాబోయ్.. ఇలాంటి ఫ్యాషన్ మేమెక్కడా చూడలేదే అని కామెంట్స్ రాస్తూ ట్రోల్ చేస్తోన్న వాళ్లు కూడా లేకపోలేదు. 


ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కింద ఒక నెటిజెన్ స్పందిస్తూ.. "పిజ్జా ఎవరైనా తినేస్తే నీ పరిస్థితి ఏంటి " అని కామెంట్ రాశాడు. అతడిది చిలిపి ఆలోచన అనుకోవాలో లేక కక్కుర్తి అనుకోవాలో అర్థం కావడం లేదు అంటూ మరో నెటిజెన్ రియాక్షన్ ఇచ్చాడు. ఇంకొక ఇన్ స్టాగ్రామ్ యూజర్ స్పందిస్తూ.. కనీసం తినే ఆహార పదార్థాలనైనా విడిచిపెట్టొచ్చు కదా అంటూ కామెంట్ రాసుకొచ్చాడు. 



ఇది కూడా చదవండి : Jabardasth Artist Hari: రెడ్ శాండల్ఉడ్ స్మగ్లింగ్ కేసులో జబర్ధస్త్ ఆర్టిస్ట్


అంతటితో అయిపోలేదండోయ్.. నాకు ఆకలి వేస్తోంది.. ఒక పిజ్జా ముక్క తీసుకోవచ్చా అని అడిగిన వాళ్లు కూడా లేకపోలేదు. ఆ మిగిలిన ఒక్క పిజ్జా ముక్కను నాకు ఇచ్చేయ్ అంటూ మరొక నెటిజెన్ చిలిపి ప్రశ్న సంధించాడు. వీళ్ల ఆకలి తగలెయ్య.. ఉర్ఫి జావేద్ ధరించిన పిజ్జా అంటే ఎందుకంత క్రేజ్ అని సందేహం వ్యక్తం చేసిన సోషల్ మీడియా యూజర్స్ కూడా ఉన్నారు. ఏదేమైనా.. ఇలాంటి బోల్డ్ ఫ్యాషన్ తో ఉర్ఫీ జావేద్ మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది.


ఇది కూడా చదవండి : Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ డ్రెస్సును ఎత్తిపట్టుకున్నాడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK