Urvashi Rautela Umair Sandhu Issue ఉమైర్ సంధు అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఎప్పుడూ కారు కూతలు కూస్తూనే ఉంటాడు. ఒకప్పుడు కేవలం సినిమా సెన్సార్, రివ్యూల గురించి మాత్రమే ట్వీట్లు వేస్తుండేవాడు. దుబాయ్‌లో సెన్సార్ సభ్యుడు అని తనకు తానే చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఈ మధ్య సదరు వ్యక్తి కాస్త హద్దులు దాటేస్తున్నాడు. సెలెబ్రిటీల పర్సనల్ విషయాల మీద పిచ్చి కూతలు కూస్తున్నాడు. గేలు, లెస్బియన్‌లు అంటూ నానా హంగామా చేస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ హీరో ఈ హీరోయిన్‌తో ఉన్నారని, ఆ ప్రొడ్యూసర్ హీరోలను వేధిస్తున్నాడని ఇలా నోటికి ఎంతొస్తే అంత అనేస్తున్నాడు. ఇలానే ఓ సారి అఖిల్,ఊర్వశీ రౌతేలా మీద ట్వీట్ వేశాడు. ఊర్వశీని అఖిల్ వేధించాడంటూ ట్వీట్ వేయగా.. అది వైరల్ అయింది. చివరకు అది ఊర్వశీ కంట పడింది. దీంతో ఊర్వశీ మండిపోయింది. ఇలాంటి పిచ్చి కూతలు ఎందుకు కూస్తారు.. అంటూ ఫైర్ అయింది.


Also Read:  Manobala Death : ఇండస్ట్రీలో విషాదం.. నటుడు మనోబాల మృతి


సదరు వ్యక్తి మీద పరువునష్టం దావా కేసు కూడా వేశానంటూ ఊర్వశీ ట్వీట్ వేసింది. నువ్వేమీ నా పర్సనల్ పీఆర్ కాదని, ఇలాంటి పిచ్చి వార్తలు స్ప్రెడ్ చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సదరు వ్యక్తి ఊర్వశీ పరువుతీసేలా ట్వీట్ వేశాడు. తానేదో గెలిచానంటూ విర్రవీగాడు.


 



చూశారా? నా పవర్..నాపై పరువునష్టం దావా వేస్తానంటూ చేసిన పోస్టులు ట్విట్టర్, ఇన్ స్టాలో డిలీట్ చేసింది అంటూ నవ్వుతున్నట్టుగా ఓ ట్వీట్ వేశాడు. నన్ను భయపెట్టాలని చూసింది.. కానీ ఆమె భయపడింది అంటూ కాస్త అతి చేశాడు. అయితే ఊర్వశీ ఎందుకు ఇలా ట్వీట్లు, పోస్ట్ డిలీట్ చేసింది అన్నది తెలియడం లేదు. దీనిపై ఊర్వశీ ఏమైనా స్పందిస్తుందా? అన్నది చూడాలి. మొత్తానికి అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో ఊర్వశీ అందాల ఆరబోత వృథా అయింది.


Also Read:  Aadi Sai Kumar Wife : ఇలా కూడా ఉంటారా?.. ఆది సాయి కుమార్ భార్య కోరిక, కల ఇదేనట



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook