హేట్ స్టోరీ-4 సినిమాతో బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది నటి, మోడల్ ఊర్వశి రౌటేలా. ఊర్వశి నటించిన ఈ అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఈ ట్రైలర్‌కి ఆడియెన్స్ సోషల్ మీడియాలో బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఇక అదే ట్రైలర్ బాటలో తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. గతంలో ప్రముఖ కంపోజర్, సింగర్ హిమేష్ రేష్మియా పాడిన సూపర్ హిట్ ట్రాక్ ఆషిక్ బనాయా ఆప్నే పాటను ఈ సినిమాలో మరోసారి రీమేక్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ప్రస్తుతం ఉత్తరాదిన పాప్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్య గాయని నేహా కక్కర్, హిమేష్ రేష్మియా కలిసి పాడిన ఈ పాటలో ఊర్వశి రౌటేలా వేసిన సెక్సీ స్టెప్పులు ఇప్పుడు యూత్ ఆడియెన్స్‌కి కిక్కెస్తున్నాయి. తనిష్క్ బగ్చీ అందించిన మ్యూజిక్ సైతం ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. టీ సిరీస్ నిర్మించిన ఈ సినిమా మార్చి 9వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. 


 


గతంలో హేట్ స్టోరీ సీక్వెల్స్‌కి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని టీ సిరీస్ ఈ సినిమాని నిర్మించింది. హేట్ స్టోరీ 2, హేట్ స్టోరీ 3 సినిమాలు డైరెక్ట్ చేసిన విశాల్ పాండ్య ఈ సీక్వెల్‌ని కూడా డైరెక్ట్ చేశాడు.