Urvashi Rautela Opens upon Relation With Rishabh Pant: ఊర్వశి రౌతేలా అలాగే ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య ఏదో ఉందంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. మధ్యమధ్యలో వీరిద్దరి ఎఫైర్ గురించి చాలా చర్చలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఊర్వశి ఆర్పీ పేరుతో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినప్పుడల్లా అది రిషబ్ పంత్‌ గురించే అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక చాలా కాలం తర్వాత ఈ ఊహాగానాలన్నింటికీ తెర దించింది ఊర్వశి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు, రిషబ్ పంత్‌కు మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని.. మ్యాచ్ చూసేందుకు వచ్చి రిషబ్‌పై వ్యాఖ్యానించడం కేవలం అపార్థం మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది. అలాగే 'RP' పేరు కారణంగా ఈ అపార్థం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి ఊర్వశి ఇటీవల యాక్టర్ రామ్ పోతినేనితో ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేసింది. ఈ విషయం గురించి కొంతకాలం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు, ఊర్వశి ఆర్పీ తన కో-స్టార్ అని, రిషబ్ పంత్‌ను ఆర్పీ అని కూడా పిలుస్తారని తనకు తెలియదని వెల్లడించింది.


అయితే ఒక పక్క రిషబ్ - మరోపక్క ఊర్వశి అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఊర్వశి తన మౌనాన్ని వీడింది. ఈ సందర్భంగా ఊర్వశి మాట్లాడుతూ 'ఆర్‌పి నా సహనటుడు, అతని పేరు రామ్ పోతినేని. రిషబ్ పంత్‌ని ఆర్పీ అని కూడా పిలుస్తారని కూడా నాకు తెలియదని పేర్కొంది. ఇక జనాలు వారి స్వంతంగా ఊహించి, దానిపై రాయడం ప్రారంభించారని, వారు కనీసం కొంత విశ్లేషణ అయినా చేసి ఉండాలని పేర్కొంది.


యూట్యూబ్‌లో ఎవరైనా ఏదైనా చెబితే, ప్రజలు దానిని అంత తేలిగ్గా ఎలా నమ్ముతారని ప్రశ్నించింది. ఆమె మాట్లాడుతూ, 'ఈ పోలిక ఎప్పుడూ కనిపిస్తుందని, నటుల కంటే క్రికెటర్లకు ఎక్కువ గౌరవం ఇస్తారని, వారు నటుల కంటే ఎక్కువ సంపాదిస్తారని పేర్కొంది. ఇదంతా నన్ను ఇబ్బంది పెడుతోందని, వారు మన దేశం కోసం ఆడతారని, వవారిని అందరూ ఇష్టపడతారని, అయితే నటులు కూడా చాలా చేస్తారు ఇప్పుడు వారినీ వీరిని పోల్చి చూడడం నాకు నచ్చవని పేర్కొన్నారు. 
Also Read: Sailesh Kolanu: నానితో హిట్ 3 కోసం ఫాన్స్ రిక్వెస్ట్.. చంపేద్దామంటున్న శైలేష్ కొలను


Also Read: Ram Gopal Varma Dangerous : ఒకేసారి నలుగురితో.. వామ్మో అనేలా ఆర్జీవీ.. అప్పట్లో చేసిన పనులపై వర్మ కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook