Urvashi Rautela Clarity on her viral ‘I Love You’ video: కొంతమంది నటీనటులు చేసే సినిమాల కంటే ఎక్కువగా తమ వివాదాస్పద వ్యాఖ్యలు, పనుల వల్ల ఎక్కువగా వార్తల్లో ఉంటారు. ఇక చాలా కాలంగా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా తన హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది అందుకే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఏవో ఒక ట్రెండింగ్ స్టఫ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఊర్వశి రౌతేలాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆ వీడియోలో ఆమె పదే పదే ఎవరికో ఐ లవ్ యూ చెబుతోంది. గత కొన్నాళ్లుగా ఆమె రిషబ్ పంత్ తో బ్రేకప్ చెప్పుకుని విడిపోయిందని, అతన్ని కావాలనే టార్గెట్ చేస్తోందని రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.  ఇప్పుడు ఈ వైరల్ వీడియో కూడా ఆమె పంత్ ను ఉద్దేశించే చేసిందని ప్రచారం జరుగుతున్న క్రమంలో అసలు ఈ వైరల్ వీడియోలో నిజమెంతో చెప్పింది ఊర్వశి. ఊర్వశి ఈ పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ వీడియోపై ఊర్వశి క్లారిటీ ఇచ్చింది.


ఐ లవ్ యూ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది కానీ ఇది ఏ వీడియో కాల్‌లో బిట్ లేదా ఏదైనా ఒక్కరి కోసమో చేసిన వీడియో కాదని పేర్కొంది. ఊర్వశి రౌతేలా చేసిన ఈ ఐ లవ్ యు వీడియో బయటకు వచ్చిన వెంటనే, నెటిజన్లు ఆ వీడియోకి క్రికెటర్ రిషబ్ పంత్‌తో లింకు పెడుతూ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఈ వీడియో రిషబ్ కోసమే అని కొందరు సోషల్ మీడియా నెటిజన్లు భావిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


ఊర్వశి చాలా కాలం నుంచి రిషబ్ పంత్ తో రిలేషన్‌షిప్‌లో ఉందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే, ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా, ఈ వీడియో కేవలం ఒక డైలాగ్‌ గురించి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇక ఊర్వశి టీమ్ ఇండియాను ఉత్సాహపరిచేందుకు ఊర్వశి ఆస్ట్రేలియా వెళ్లినట్లు కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో, ఊర్వశి ఏదో ఒక సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 


Also Read: Allu Sirish Breakups: పెద్దింటి అమ్మాయితో అల్లు శిరీష్ బ్రేకప్.. ప్రమోషన్స్ లో బరస్ట్ అయిన హీరో!


Also Read: Bobby Deol in Pushpa 2: పుష్ప సినిమాలో బాలీవుడ్ స్టార్.. రచ్చ రేపుతున్న సుకుమార్ ప్లానింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook