Allu Sirish Urvasivo Rakshasivo Telugu Movie Review: అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. నిజానికి ముందు ఈ సినిమా పేరు వేరే అనుకున్నారు కానీ అనూహ్యంగా రిలీజ్ కి దగ్గరయిన తర్వాత టైటిల్ మార్చారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు గాని ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఊర్వశివో రాక్షసివో కథ: 
చిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే మిడిల్ క్లాస్ అబ్బాయి శ్రీ కుమార్(శిరీష్). అయితే సిరి(అను ఇమ్మాన్యుయేల్) ఒక రిచ్ అమ్మాయి. ఇద్దరూ భిన్న స్వభావాలు కలిగిన వాళ్ళే అయినా ఒకానొక సందర్భంలో పెళ్లి, రిలేషన్ షిప్ కి సంబంధించిన కొన్ని ప్రపోజల్స్ పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది? అది పెళ్లి వరకు వెళ్తుందా ? లేక లివ్ ఇన్ రిలేషన్ వరకే పరిమితం అవుతుందా? చివరికి ఈ ఇద్దరిలో ఎవరి వాదన నిజమవుతుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


విశ్లేషణ:
అల్లు శిరీష్ ఇమేజ్ అలాగే దర్శకుడు గత రికార్డులను చూసి వెళ్ళగలిగే సినిమా కాదు ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసి బయటకు పంపిస్తారు గతంలో మనం చూసిన కథ అయినా సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి అందులో సఫలం అయ్యారు దర్శకుడు. ఈ సినిమా రీమేక్ అనే విషయాన్ని ముందు నుంచి ఎక్కడా రివీల్ చేయలేదు కానీ తమిళంలో విడుదల సూపర్ హిట్గా నిలిచిన "ప్యార్ ప్రేమ కాదల్" కి తెలుగు రీమేక్ "ఈ ఊర్వశివో రాక్షశివో". ఎక్కడా సొంత క్రియేటివిటీకి పని పెట్టుకోకుండా హీరో హీరోయిన్ల పేర్లతో సహా తమిళ మాతృక నుంచి యథాతథంగా దించేశారు. పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు కానీ తెలుగులో కామెడీ ట్రాక్ బాగా పండే విధంగా సీన్లు రాసుకున్నారు. కామెడీ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో పాటు లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ కూడా వర్క్ అవుట్ అవ్వడంతో సినిమా చూసిన వారందరూ బాగుందని అంటున్నారు. అల్లు శిరీష్ నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో చూసిన వారందరూ సినిమా బాగుందని కామెంట్ చేస్తున్నారు.


నటీనటులు:
గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అల్లు శిరీష్ నటన బాగుంది, స్క్రీన్ మీద క్యారెక్టర్ మాత్రమే కనిపించిందని చెప్పాలి. ఇక బ్రాండ్ మైండ్ రిచ్ అమ్మాయిగా అను ఇమ్మాన్యుయేల్ జీవించేసింది. సునీల్ చాలా రోజుల తర్వాత మళ్లీ తన టైమింగ్ చూపించాడు.. వెన్నెల కిషోర్ కూడా అదరగొట్టారు.


సాంకేతిక వర్గం విషయానికి వస్తే: 


ఈ సినిమాకు కామెడీ బాగా చాలా బాగా వర్కవుట్ అయింది. ఫస్టాఫ్ అంతా డీసెంట్‌గానే అనిపిస్తుంది, కానీ అసలు కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సెకండాఫ్ మొదటి అరగంట అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. సునీల్, వెన్నెల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. యూత్‌ను మెప్పించేలా బోల్డ్ కంటెంట్ బోలెడంత ఉంచారు. ఇక ట్రైలర్ చూసి సినిమాలో కేవలం ముద్దులు, హాట్ సీన్స్ మాత్రమే ఉంటాయని అనుకుంటే పొరపాటే ఎమోషనల్ కంటెంట్ కూడా సినిమాలో గట్టిగానే ప్లాన్ చేశారు. ఒకరకంగా రెండింటినీ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేశారు దర్శకుడు రాకేష్ శశి. వాటితో పాటు ఎంటర్‌టైన్మెంట్ సమపాళ్లలో ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. సింపుల్ కథను స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు. అచ్చు రాజమణి సంగీత, కెమెరామెన్ కెమెరా వర్క్ కూడా సినిమాను మరో లెవల్ కు తీసుకు వెళ్ళింది. 


ఫైనల్ గా:
ఓవరాల్‌గా ఊర్వశివో రాక్షసివో.. ఫ్యామిలీతో కాదు కానీ స్నేహితులతో హాయిగా చూడదగ్గ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్.

 


Rating: 2.75/5


Also Read: Like Share & Subscribe Review: సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ రివ్యూ


Also Read: Gaalodu Official Trailer : సైలెన్స్, వయలెన్స్ తప్పా నీకేం తెలీదారా?.. దుమ్ములేపేసిన సుడిగాలి సుధీర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook