మూవీ రివ్యూ: ఉత్సవం (Utsavam )
నటీనటులు: దిలీప్ ప్రకాష్,రెజినా,  రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, అలీ, ఎల్బీ శ్రీరామ్, అనీష్ కురువిళ్ల తదితరులు..
సినిమాటోగ్రాఫర్: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు
మ్యూజిక్: అనూప్ రూబెన్స్
నిర్మాత: సురేష్ పాటిల్
దర్శకత్వం: అర్జున్ సాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దిలీప్ ప్రకాష్, రెజినా హీరో, హీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.


కథ :
అభిమన్యు నారాయణ (ప్రకాశ్ రాజ్)..అంతరించి పోతున్న సురభి నాటక మండలికి చెందిన ఎంత్ ప్రేక్షకాదరణ ఉన్న కళాకారుడు. అతని కుమారుడు కృష్ణ (దిలీప్ ప్రకాష్) నాటకాలంటే ఎంతో అభిమానం. అంతరించిపోతున్న నాటక వ్యవస్థను, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో మరో రంగస్థల నారడు మహాదేవ్ నాయుడు (నాజర్) కుమార్తెతో రమ(రెజీనా)తో కలిసి కార్పోరేట్ వీకెండ్ ఈవెంట్స్ లో ప్రదర్శనలు ఇస్తుంటారు. ఈ క్రమంలో కృష్ణ, రమ ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోతారు.  మరోవైపు దోస్తులైన అభిమన్య నారాయణ, మహదేవ్ నాయుడు కలిసి తమ పిల్లలకు పెళ్లీళ్లు చేయాలనుకుంటారు. అయితే పెళ్లి సమయం వరకు వీళ్లిద్దరే పెళ్లి కుమారుడు, కూతురు అనే విషయం తెలియక ఇంట్లోంచి పారిపోతారు. పెళ్లి ముహూర్తానికి వాళ్లను తీసుకురావాలని ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు ఒకరికొకరు తెలియకుండా వెతికే ప్రయత్నంలో ఉంటారు. ఆ తర్వాత వీళ్లిద్దరు దొరికారా.. ? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని వాళ్లు తెలుసుకున్నారా.. ? చివరకు వీళ్లిద్దరు ఒకటయ్యారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.  


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..


ప్రస్తుత సినిమాలకు మూలం నాటకాలు. ఒకపుడు నాటకాల్లో మంచి నటన కనబరిచిన వారే సినిమాల్లో రాణించినవారే. ఎన్టీఆర్, అక్కినేని వంటి వారు ఎంతో మందికి రంగస్థలంపైనే తన నటనకు సంబంధించిన ఓనమాలు దిద్దుకున్నారు. అలాంటి నాటక రంగం మీద సినిమా కథను ఎంచుకోవడం కత్తి మీద సామే. ఏ మాత్రం అటు ఇటు అయినా.. అంతే సంగతులు. అలాంటి టఫ్ సబ్జెక్ట్ ను దర్శకుడు సాయి అర్జున్ ఎంతో అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ముఖ్యంగా సురభి నాటక కళాకారులు పడుతున్న కష్టాలను ఎంతో హృద్యంగా చూపించాడు. అక్కడక్కడ తడబడ్డా ఓవరాల్ గా మాత్రం ఆకట్టుకుంటుంది. మధ్యలో ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బెటర్ గా తీసుంటే బాగుండేది. ఈ సినిమాలో క్రిష్ తెరకెక్కించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ , రంగ మార్తాండ సినిమాలు గుర్తుకు వస్తుంటాయి. మధ్యలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ యూత్ ను ఆకట్టుకునే విధంగా  ఉన్నాయి.


సినిమా ప్రథామార్థంలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్, నాటక కళాకారులు కష్టాలను ప్రెజెంట్ చేసాడు. సెకండాఫ్ లో నాటక కళాకారులకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేసాడు. క్లైమాక్స్ లో జంధ్యాల రెండు రెండ్ల ఆరు సినిమా తరహాలో నవ్విస్తూ ట్విస్ట్ ఇవ్వడం ప్రేక్షకులను అలరిస్తుంది. దక్ష యజ్ఞం నాటకం ఎపిసోడ్ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేది.


నటీనటుల విషయానికొస్తే..
దిలీప్ ప్రకాష్ కు ఇది రెండో చిత్రం అయిన.. ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడిగా మెప్పించాడు. సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ లో రాణించాడు. సీనియర్ నటుల మధ్య తన యాక్టింగ్ తో ఉనికి చాటుకున్నాడు. రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. రెజీనా స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది.  తెరపై గ్లామర్ గా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు.'దక్ష యజ్ఞం' ఎపిసోడ్ లో మహాదేవుడి పాత్రలో అద్భుత అభినయం కనబరిచారు. ప్రకాష్ రాజ్ ఎంత మంచి నటుడూ మరోసారి ఈ సినిమాలో చూపించాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్ పాత్రలో నాజర్ ఒదిగిపోయాడు. ప్రకాష్ రాజ్, నాజర్ పోటాపోటీగా అదరగొట్టేసారు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్ తమ పాత్రల్లో ఒదిగిపోయిన తీరు బాగుంది.


పంచ్ లైన్.. నాటక రంగ‘ఉత్సవం’..


రేటింగ్ : 3/5


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.