Krishna Gadu Ante Oka Range ఏ సినిమా తీసుకున్నా అందులో కచ్చితంగా ప్రేమ కథ ఉంటుంది. ఉండాల్సిందే. ప్రేమ లేకపోతే సినిమాను జనాలు అంతగా రిసీవ్ చేసుకోరు. అది ఎలాంటి జానర్ సినిమా తీసినా సరే లవ్ స్టోరీ మాత్రం కంపల్సరీ అన్నట్టుగా మారుతుంది. అలాంటి పూర్తిగా లవ్ స్టోరీనే తెరకెక్కించే సినిమాలపై మరింతగా క్రేజ్ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు అలాంటి ఓ ఫీల్ గుడ్ స్టోరీతోనే కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే సినిమా రాబోతోంది. పెట్ల కృష్ణమూర్తి, పెట్ల వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలతలు సంయుక్తంగా ఈ సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేష్‌ దొండపాటి డైరెక్టర్‌గా పరిచయం కాబోతోంది. ఆయన ఇది వరకు అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశారు.


 



ఈ మూవీలో రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ షురూ చేసింది. సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని, ఆల్ ది బెస్ట్ తెలిపారు.


వివి వినాయక్ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ఎలాంటి సంగీతం కావాలో అలాంటి సంగీతాన్ని సాబు వర్గీస్ అందించారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లోని బీజీఎం కూడా అందరినీ కట్టిపడేసేలా ఉంది. ఎస్ కే రఫి కెమెరాపనితనం ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా సాయి బాబు తలారి, లిరిక్ రైటర్‌గా వరికుప్పల యాదగిరి వ్యవహరించారు.


Also Read:  Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే


Also Read: SSMB 28 Look : మహేష్‌ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి