Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ డేట్ ఇదే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ టీజర్ విడుదల తేదీని వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ టీజర్ విడుదల తేదీని వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రకటన చేసింది. వకీల్ సాబ్ మూవీ టీజర్ ను అభిమానులకు సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా బోనీ కపూర్ ప్రజెంట్ చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తుండగా పవన్ సరసన శృతి హాసన్ జంటగా నటించింది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వకీల్ సాబ్ మూవీకి థమన్ మ్యూజిక్ అందించగా.. ఈ సినిమా నుంచి విడుదలైన మగువా మగువా పాటకు ( Maguva Maguva song ) ఇప్పటికే భారీ స్పందన లభించింది.
Also read : Master Telugu movie: విడుదలకు ముందే మాస్టర్ దూకుడు
వాస్తవానికి వకీల్ సాబ్ సినిమా ( Vakeel Saab movie) సంక్రాంతి బరిలోనే నిలుస్తుందని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశించినప్పటికీ.. చిత్ర నిర్మాతలు మాత్రం సమ్మర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Also read : Pawan kalyan: వకీల్‌సాబ్ ఎప్పుడొచ్చేది ఫిక్స్ అయిపోయింది..ఇక పండగే ఫ్యాన్స్‌కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G