Varalaxmi Sarathkumar Comments on Samantha Ruthprabhu: స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా మూవీ 'యశోద', ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కూడా ఆమె పాత్ర పవర్ ఫుల్ గా ఉండబోతుందని అర్ధం అవుతోంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ యశోద సినిమాను హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో మాట్లాడి పలు ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'యశోద' కథ విన్నప్పుడు అసలు ఇలాంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారా? అని ఆశ్చర్యపోయానని, సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్... మా కథలు ఆసక్తిగా ఉంటాయని ఆమె వెల్లడించారు. ఒక ఈ స్క్రిప్ట్ పరంగా తాను పెద్ద ఛాలెంజ్ ఏమీ ఫీల్ అవ్వలేదన్న ఆమె నటిగా మంచి క్యారెక్టర్ చేశానని, ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేసే సమయంలో నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటా. ఆ విధంగా ఛాలెంజింగ్ అనిపించిందని అన్నారు.


ఇది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా అని పేర్కొన్న వరలక్ష్మీ  నాది సెకండ్ లీడ్ అని, ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదన్నారు. ఇక తనకు సమంత పది పన్నెండు ఏళ్ల క్రితమే తెలుసని, మాకు చెన్నైలో పరిచయం అయ్యిందని వరలక్ష్మీ పేర్కొన్నారు. ఈ సినిమాలో సమంతకు సీరియస్ సీన్స్ ఉన్నాయి కానీ నేను షూటింగ్ గ్యాప్ వస్తే జోక్స్ వేసేదాన్నని వాటికి ఆమె బాగా నవ్వేసి 'షాట్ ముందే ఎందుకు ఇటువంటి జోక్స్ వేస్తావని అంటూ ఆమె ఇబ్బంది పడేదని వరలక్ష్మీ చెప్పికొచ్చారు.


ఇక సమంతతో నటించడం సరదాగా ఉంటుందన్న ఆమె సమంత ఒక స్ట్రాంగ్ ఉమెన్, యశోద పాత్రలో జీవించిందని, ఒక పవర్ ఫుల్ రోల్ బాగా చేసిందని అన్నారు. ఇక ఈ సినిమాలో తాను చేసిన క్యారెక్టర్‌లో డెప్త్ బాగా నచ్చిందన్న వరలక్ష్మీ 'యశోద' క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ రోల్ అని అందుకే దానికోసం సమంత చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. ఈ క్యారెక్టర్స్ కంటే కథ నా ఫేవరెట్ అని పేర్కొన్న వరలక్ష్మీ 'యశోద'లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమేనని అన్నారు. 


Also Read: Kantara Movie Audience Review: కాంతార, ఒక గొప్ప అనుభూతి.. అద్భుతం అంటూ గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ఎన్నారై రివ్యూ


Also Read: Music Director Passes Away: సినీ పరిశ్రమలో విషాదం.. జాండీస్ దెబ్బకు మ్యూజిక్ డైరెక్టర్ మృతి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook