Varisu Art director Sunil Babu passes away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణ భారత సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్ బాబు కన్నుమూశారు. ఆయన వవయసు 50 ఏళ్లు. గుండెపోటుతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. మూడు రోజుల క్రితం సునీల్ కాలి నుంచి చీము లాంటి ఒక ద్రవం రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళలోని పాతనంతిట్టలోని మల్లాపల్లికి చెందిన సునీల్ మలయాళం, తమిళం, తెలుగు, బాలీవుడ్ చిత్రాల్లో ఆర్ట్ డైరెక్టర్‌గా బిజీగా ఉన్నారు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ సినిమాకు సునీల్ బాబు చివరిగా పని చేశారు. ఈ సినిమా సంక్రాంతి సంధర్భంగా మరో వారంలో విడుదల కావాల్సి ఉండగా సునీల్ ఇప్పుడు చనిపోవడంతో సినిమా యూనిట్ అంతా షాక్ లో ఉండిపోయింది.


వివిధ భాషల్లో 100 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ బాబు గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న సీతారామం సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. మైసూరు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న తర్వాత ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దగ్గర అసిస్టెంట్‌గా సినిమా రంగంలోకి ప్రవేశించిన సునీల్ బాబు ప్రముఖ కెమెరామెన్ సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన అనంతభద్రం చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించి ఉత్తమ కళా దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆ తరువాత సునీల్ బాబు అనంతభద్రం, ఉరుమి, ఛోటా ముంబై, అమీ, ప్రేమమ్, నోట్‌బుక్, కాయంకుళం కొచ్చున్ని, పజాసిరాజా, బెంగుళూరు డేస్ వంటి సినిమాలు మలయాళంలో చేశారు.


 ఇక బాలీవుడ్‌లో ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం, స్పెషల్ చౌబీజ్ వంటి చిత్రాలకు పనిచేసిన సునీల్ ఓ ఇంగ్లీష్ మూవీకి కూడా ఆర్ట్ డైరెక్షన్ కూడా చేశారు. ఇక తెలుగులో మహర్షి, సీతారామం వంటి సినిమాలకు ఆయన పని చేశారు.  సునీల్ బాబు మల్లపల్లి కున్నంతనం రామమంగళం తంకప్పన్ నాయర్, సరస్వతీమ్మ దంపతుల కుమారుడు కాగా ఆయనకు భార్య ప్రేమ, కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. ఇక ఆయన  మృతదేహాన్ని కొచ్చి అమృత ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. 
Also Read: Ramya Raghupathi Shocking Comments: నరేష్ -పవిత్రల పెళ్లి, లిప్ లాక్ పై రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్!


Also Read: Ramya Raghupathi Shocking Video: కృష్ణ చనిపోయిన నైట్ నరేష్- పవిత్ర మిస్సింగ్.. అనాధలా కృష్ణ పార్థివదేహం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook