Nindha Teaser: వరుణ్ సందేశ్ `నింద` టీజర్ చూశారా..? క్రైమ్ థ్రిల్లర్‌తో మాస్టర్ ప్లాన్
Nindha Movie Teaser: వరుణ్ సందేశ్ నింద మూవీ టీజర్‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. మర్డర్, క్రైమ్, లవ్ స్టోరీ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ.. డిఫరెంట్‌గా టీజర్‌ను కట్ చేశారు. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Nindha Movie Teaser: డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు వరుణ్ సందేశ్. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన నింద అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలరించనున్నాడు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జగన్నాథం దర్శకత్వం వహించడంతోపాటు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు.
Also Read: Kangana - Emergency Postponed: కంగనా రనౌత్.. ఎమర్జన్సీ విడుదల వాయిదా.. అసలు కారణం ఇదే..
ఇక తాజాగా నింద మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విలక్షణ నటుడు నవీన్ చంద్ర చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు నవీన్ చంద్ర ఆల్ ద బెస్ట్ చెప్పారు. టీజర్ బాగుందని చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. చాలా మంచి స్క్రిప్ట్‌లా అనిపిస్తోందన్నారు. వరుణ్ సందేశ్ లుక్ చాలా బాగుందన్నారు. టీజర్‌ను చూస్తుంటే సినిమాలో ఏదో ఉందో అనే ఆసక్తి కలుగుతోందన్నారు. టీజర్‌ను తాను రెండుసార్లు చూశానని చెప్పారు. ఆడియన్స్‌ను థియేటర్లలో తప్పకుండా నింద సినిమాను చూడాలని కోరారు.
జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా.. చేయక తప్పదు అనే డైలాగ్‌తో టీజర్‌ను మొదలుపెట్టారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. టీజర్‌లో ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి. మర్డర్, క్రైమ్ మిస్టరీని యాడ్ చేయడంతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. విజువల్స్ కూడా న్యాచురల్‌గా ఉన్నాయి. టీజర్‌ను చూస్తుంటే వరుణ్ సందేశ్ కమ్‌బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని ఆడియన్స్ అంటున్నారు. నింద మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సంతు ఓంకార్ సంగీతం అందించారు. కెమెరామెన్‌గా రమీజ్ నవీత్ పనిచేయగా.. ఎడిటింగ్ బాధ్యతలు అనిల్ కుమార్ నిర్వర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter