Gandeevadhari Arjuna OTT: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన మూవీ 'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna Movie). స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఎస్వీసీసీ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. కానీ థియేటర్లలో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస వద్ద బోల్తా పడింది. ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. మూవీలో మితిమీరిన యాక్షన్ సీన్స్, ఆసక్తికరంగా కథ లేకపోవడం వల్ల సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి పలాస ఫేమ్‌ కరుణ్‌ కుమార్ దర్శకత్వం వహించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. సెప్టెంబరు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో గాండీవధారి అర్జున స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటీటీలో ఎలా రాణిస్తుందో చూడాలి. సోల్జర్ గా పనిచేసిన అర్జున్‌ (వరుణ్‌ తేజ్‌) ఓ ఏజెన్సీ తరఫున లండన్‌లో బాడీ గార్డుగా నియమింపబడతాడు. జీ 20 సదస్సు కోసం యూకే వెళ్లిన కేంద్రమంత్రి ఆదిత్య రాజ్‌ బహదూర్‌ ను రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు. మరి అర్జున్ కేంద్రమంత్రిని కాపాడాడా లేదా తెలుసుకోవాలంటే గాండీవధారి అర్జున సినిమా చూడాల్సిందే. థియేటర్లలో మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 



Also Read: Bigg Boss Telugu 7: యావర్ నువ్వు మారవా.. వెన్నుపోటు పొడిచిన అమ్మాయితో రొమాన్సా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook