Varun Tej Upcoming Movies: వరుణ్ తేజ్.. ముకుంద లాంటి మంచి క్లాసిక్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగా హీరో. భారీ ఫిజిక్ తో పాటు యాక్షన్ సినిమాలకు బాగా సెట్ అయ్యే కటౌట్ ఉన్నప్పటికీ గత కొద్ది కాలంగా ఇతని ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. అయినా సరే సక్సెస్ సాధించడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా అతను నటించిన గాండీవ దారి అర్జున్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసి బోల్తా పడింది. నిజానికి ఈ చిత్రం థియేటర్లలో ఎప్పుడు విడుదల అయిందో కూడా తెలియనంత డిజాస్టర్ గా మిగిలింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో అతను పూర్తి హోప్స్ మార్చ్ ఒకటిన్న విడుదలైన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంపై పెట్టుకున్నాడు. అందుకే ఈ సినిమాకి ఎప్పుడు లేనంత ప్రమోషన్స్ చేశారు. అయితే ఈ మూవీ ఫలితం వరుణ్ తేజ్ ఊహించిన దానికి విరుద్ధంగా ఉంది. ఓపెనింగ్స్ లోనే ఈ విషయం క్లియర్ గా అర్థమయిపోయింది. పబ్లిక్ టాక్ తో పాటు రివ్యూలు కూడా ఆశాజానికంగా లేకపోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ గా మారాయి. తెలుగులోనే కాదు వరుణ్ విపరీతంగా ప్రమోట్ చేసిన హిందీలో కూడా ఈ చిత్రానికి కూసంత ఆదరణ కూడా లభించలేదు.


తన స్టైల్ ఆఫ్ యాక్షన్ ని పక్కన పెట్టి ..కమర్షియల్ ఫార్ములాకు దూరంగా విభిన్నమైన పాత్రలు చేయడానికి ప్రయత్నించిన ఈ మెగా హీరో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. అయితే ప్రస్తుతం వరుణ్ చేస్తున్న ఈ ప్రయోగాల కారణంగా అతని మార్కెట్ డౌన్ అవ్వడంతో పాటు మాస్ ఆడియన్స్ కు క్రమంగా దూరమయ్యే రిస్క్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అంతకుముందు వరుణ్ నటించిన గని చిత్రం కూడా ఇంచుమించు ఇలాంటి ప్రయోగమే. ఎంతో కష్టపడి బాడీ బిల్డ్ చేసి బాక్సర్ గా యాక్షన్ సన్నివేశాలలో నటించినప్పటికీ పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. ఉపేంద్ర లాంటి సీనియర్ హీరోలతో స్పెషల్ రోల్ చేయించినప్పటికీ పెద్దగా అచ్చి రాలేదు. 


మరోపక్క వరుణ్ నటించిన ఎఫ్2 ,ఫిదా ,తొలిప్రేమ లాంటి చిత్రాలు అతనికి మంచి మార్కెట్ వాల్యూను తెచ్చిపెట్టాయి. ఈ చిత్రాలు బాగా గమనించినట్లయితే ప్రేక్షకులు అతని నుంచి ఏమి కోరుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా అటువంటి పాత్రలో.. వరుణ్ కనిపించాడు. అంతే పనుంది ఎక్కువగా ప్రేక్షకులు ఏదైనా ఎంటర్టైన్మెంట్ లేదా ప్రేమ కథలో చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఇకనైనా అతను ఇటువంటి ప్రయోగాలను కాస్త పక్కన పెట్టి ఆడియన్స్ ను మెప్పించే రోల్స్ చేస్తే కెరీర్ గాడిన పడే అవకాశం ఉంది.


Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!


Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook