Varun Tej Political Entry: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ.. రోజువారి వార్తలు, సమకాలీన అంశాలపై స్పందిస్తుంటారు. దీంతో పాటు అప్పుడప్పుడూ వ్యక్తిగత విశేషాలను పంచుకోవడం సహా అభిమానులతో సరదాగా కాసేపు చర్చిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవలే నెటిజన్లతో ఓ ఫన్నీ టాక్ ను నాగబాబు నిర్వహించాడు. అందులో అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా సమాధానాలు ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు సరదాగా రిప్లే ఇచ్చారు. తన కుమారుడు, హీరో వరుణ్ తేజ్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారా? అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మెగా బ్రదర్ స్పందించారు. దీంతో పాటు వరుణ్ తేజ్ పెళ్లి, నిహారికల గురించి పలువురు అడిగి తెలుసుకున్నారు. 


"వరుణ్ తేజ్ రాజకీయాల్లోకి రానున్నారా?" అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. "మీరు కూడా రాజకీయాల్లోకి రావొచ్చ"ని ఫన్నీ రిప్లే ఇచ్చారు. దీంతో పాటు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. అది వరుణ్ తేజ్ నే అడగాలని నాగబాబు సమాధానమిచ్చారు. తన సోదరుడు పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో తనకు 'జల్సా' సినిమా అంటే చాలా ఇష్టమని నాగబాబు తెలిపారు. 


తన కుమార్తె నిహారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాకు ఏమైందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. "కోడింగ్ నేర్చుకొని నిహారిక ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ చేసి.. ఆ తర్వాత డీ యాక్టివేట్ చేస్తా. డీకోడింగ్ నేర్చుకున్న తర్వాత ఆ ఖాతాను రీయాక్టివ్ చేస్తా" అని సరాదాగా రిప్లే ఇచ్చారు.  


Also Read: Bheemla Nayak OTT: పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఒక్కరోజు ముందుగానే ఓటీటీలో రిలీజ్!


Also Read: Bheemla Nayak Title Song: భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ వీడియో వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook