Varun Tej - Vikram Sirikonda Movie: రొటీన్ కథలకు దూరంగా.. స్క్రిప్ట్ లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే మెగా హీరోలలో.. వరుణ్ తేజ్ కూడా ఒకరు. అయితే వరుణ్ తేజ్ కొంతకాలంగా.. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్2, ఎఫ్3 సినిమాలు తప్ప ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. గతంలో వరుణ్ తేజ్ ఫిదా వంటి ప్రేమ కథా చిత్రాల్లో.. నటించినప్పుడు అవి మంచి విజయాలను సాధించాయి. అందుకే ఇప్పుడు వరుణ్ తేజ్.. మళ్లీ అలాంటి ఒక ప్రేమ కథతోనే త్వరలో ప్రేక్షకుల.. ముందుకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా.. సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. కానీ వరుణ్ అప్పుడే మరొక రెండు సినిమాలను.. లైన్ లో పెట్టారు. అందులో ఒక సినిమా కథ చాలా ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇది ఒక ప్రేమ కథ. అయితే ఈ కథ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతుందట. 


సినిమా కథ మొత్తం అమెరికా బ్యాక్ గ్రౌండ్ లోనే నడుస్తుందట. ఏఐ టెక్నాలజీ ఆధారంగా.. ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. ప్రేమ కథ మాత్రమే కాకుండా ఇందులో ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్.. అయ్యే చాలా ఎలిమెంట్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. గతంలో రవితేజ హీరోగా టచ్ చేసి చూడు సినిమాకి దర్శకత్వం వహించిన.. విక్రమ్ సిరికొండ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 


ఇక వరుణ్ తేజ్ మట్కా సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్.. బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత యువి క్రియేషన్స్ పతాకంపై.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. మరి చాలా కాలం తర్వాత ప్రేమ కథ చిత్రంతో కనిపించనున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.


 


Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి