Gandeevadhari Arjuna Trailer: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున' (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen Sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమాను ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సంద‌ర్భంగా గురువారం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“డిసెంబ‌ర్ 2020లో దేవుడు మీద మ‌నిషి గెలిచాడంట‌.. జ‌స్ట్ పాతికవేల సంవ‌త్సరాల‌లో మ‌నిషి చేసిన వ‌స్తువులు దేవుడు చేసిన వాటిని మించేశాయంట. ఎలాగో తెలుసా..? అనే నాజ‌ర్ డైలాగ్ తో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ తో నిండిపోయింది. ఇందులో వరుణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో..' అని చివర్లో నాజర్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. దేశాన్ని కాపాడే ఓ సీక్రెట్ ఏజెంట్ గా వరుణ్ కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 



మరోవైపు వరుణ్.. పలాస్ ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ సినిమాకు పచ్చజెండా ఊపాడు. ఈ మూవీకి రీసెంట్ గానే పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయడమే కాకుండా 'మట్కా' (Matka) అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ చిత్రానికి జీవి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించనున్నాడు. ఈ మూవీని నానితో 'హాయ్ నాన్న' చేస్తున్న వైరా సంస్థే నిర్మిసుంది. 1960ల నాటి కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 


మరోవైపు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి త్వరలో వివాహబంధం ఒక్కటికానున్నారు.  రీసెంట్ గా వీర్దద్దరి నిశితార్థం గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట షాపింగ్  కోసం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పారిస్ వీధుల్లో వీరు చక్కెర్లు కొట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి ఇటలీలోని మిలాన్ చేయబోతున్నట్లు సమాచారం. 


Also Read: OG Movie Update: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... అగ్ని తుపాన్ వచ్చేస్తోంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook