Gandeevadhari Arjuna Movie Pre-Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పాచ్ వర్క్  పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనిని చూస్తుంటే హాలీవుడ్ స్టైల్ ఆప్ మేకింగ్ కనిపిస్తుంది. వరుణ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్ లో.. వేగంగా వెళ్తున్న కారు..వెనకాల ఉన్న డిక్కీలో గన్స్‌.. వాటిలోంచి ఒక మిస్సైల్‌ లాంటి గన్‌ తీసుకుని వరుణ్ శత్రువులపై ఎటాక్ చేయడం కనిపిస్తోంది. ప్రీ టీజర్‌ ఇలా ఉంటే ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందోనని మెగా అభిమానులు ఆలోచిస్తున్నారు.  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. బీజీఎం సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


Also Read: Nani 30 Update: 'నాని 30' ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా?



కొన్నేళ్లుగా వరుణ్ కు సరైన హిట్ లేదు. గతేడాది వచ్చిన గని, ఎఫ్-3 ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ గాండీవధారి అర్జునపైనే ఉన్నాయి. ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కాలని వరుణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. గన్ ఫైట్స్, బైక్ ఛేజింగ్ లు, కారు ఛేజింగ్ లు, బిల్డింగ్ పై నుంచి దూకడాలు చూస్తుంటే ప్రవీణ్ సత్తారు వరుణ్ చేత అన్నీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో యాక్షన్ ప్రియులు కోరుకునే పసందైన విందుని అందించబోతున్నారన్న మాట.


Also Read: MI7 OTT Release Date: టామ్ క్రూజ్ MI7 ఓటీటీలోకి వచ్చేది అప్పుడే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి