Operation Valentine censor talk:  ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో రియల్ లైఫ్ ఇన్నిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రాలను ఆదరిస్తున్నారు. తెలుగులో అప్పట్లో 2008లో జరిగిన 26/11 దాడుల నేపథ్యంలో 'మేజర్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ కోవలో 2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో మన దేశ సైనికుల ప్రాణాలను బలిగొన్న ముష్కర మూకలను మన దేశ సైన్యం .. బాలాకోట్‌లో చేసిన సర్జికల్ స్ట్రైక్ దాడుల నేపథ్యంలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా తెరకెక్కింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో వరుణ్ తేజ్.. ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లోని విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల కారణంగా ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు.


అంతేకాదు పూర్తి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాను యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమా అని కితాబు ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడం కూడా పక్కా అని చెబుతున్నారు. అంతేకాదు మన ఎయిర్‌ ఫోర్స్ చేసిన సాహాసాలతో పాటు మిగిలిన నేవి, ఆర్మీ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేసారన్నదాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించినట్టు చెబుతున్నారు. మొత్తంగా 'ఆపరేషన్ వాలెంటైన్' దేశ భక్తి చిత్రాల్లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదంచుకోవడం ఖాయం అని చెబుతున్నారు.
 
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ చూస్తే.. రీసెంట్ హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన 'ఫైటర్' మూవీ కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. అందులో బాలాకోట్‌లో మన దేశ సైనికులు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. ఇపుడు అదే కాన్సెప్ట్‌తో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని తెరకెక్కింది. 2024లో ప్రేమికుల దినోత్సవం రోజున దేశ సైనికులను పొట్టన పెట్టుకున్న ముష్కరుల అంతం చేయడానికి మన దేశం చేసిన సర్జికల్ స్ట్రైక్‌కు 'ఆపరేషన్ వాలెంటైన్' పేరు పెట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. ఇందులో ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున రుద్రదేవ్ పాత్రలో వరుణ్ తేజ్ చక్కగా సరిపోయాడు.  మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటుల తమ పరిధి మేరకు నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ సహా ప్యాన్ ఇండియా భాషల్లో మార్చి 1న విడుదల కానుంది.


'ఆపరేషన్ వాలెంటైన్' మూవీనిశక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. మొత్తంగా తెలుగులో ఈ తరహా చిత్రం రావడం గమనార్హం. వరుణ్ తేజ్ విషయానికొస్తే.. ముందు నుంచి హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. మరి 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో వరుణ్ తేజ్ మరో హిట్ అందుకుంటాడా ? లేదా అనేది చూడాలి.


Also Read: FD Interest Rates: ఎఫ్‌డీలపై అత్యధికంగా 9.50 శాతం వరకూ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి