Varuntej about f3 movie : ''ఎఫ్ 3 నవ్వుల పండగలా ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు'' అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్3 వస్తున్న నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. వరుణ్ తేజ్ పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలివి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్2 పెద్ద విజయం సాధించింది. ఎఫ్3 అంటే కచ్చితంగా భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది?
కచ్చితంగా బాధ్యత ఉంటుంది. అయితే ఆభాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్‌2 షూటింగ్ సమయంలోనే ఎఫ్‌3 చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్3 డబ్బు నేపథ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్‌గా అనిపించాయి. వెంకటేష్ గారు, నేను ఎఫ్2 థియేటర్‌లో చూశాం. ప్రేక్షకుల ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్‌2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా ఉంటుంది.


ఎఫ్ 3 లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది ?
ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం.. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్  డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్‌ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా ఉంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు.. ఇలా చిన్న ఐడియాగా అనుకుని స్టార్ చేశాం. అది హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది.


నత్తి కోసం స్పెషల్ హోం వర్క్ చేశారా ?
అనిల్ రావిపూడి నటించి చూపించే వారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన ఉండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఈజీ అయ్యింది. ఐతే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. అయితే అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.


ఎఫ్3లో ఫన్ ఎవరికి ఫస్ట్రేషన్ ఎవరికి?
డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్‌ని హిలేరియస్‌గా చూపిస్తారు.


వెంకటేష్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆయన నుండి ఏం నేర్చుకున్నారు?


వెంకటేష్ గారితో కళ్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలౌతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్శనల్‌గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్‌లా ఉంటారు. చిరంజీవి గారితో ఆయనకి ఉండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా  విషయాలు మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి..  మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేష్ గారు చాలా లైట్ హార్టడ్. చాలా కూల్. చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఆయన్ని చూసి సెట్స్‌కి రెండు నిమిషాలు ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. పాజిటివ్‌గా ఉంటారు.


ఎఫ్ 3లో కామెడీ కాకుండా మీకు మెహరీన్‌కు రొమాంటిక్ లవ్ ట్రాక్ కూడా ఉందా? సాంగ్స్‌లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు?


మీరు పాటని సరిగ్గా గమనిస్తే మెహరీన్‌కు కొంచెం దూరంలోనే ఉంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ ఉంది. అయితే అమ్మాయి- అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. అన్ని పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి.  ఎఫ్ 2లో నేను వెంకటేష్ గారు కోబ్రాగా కనిపించాం. ఇందులో జస్ట్ .. బ్రోస్‌గా కనిపిస్తాం.


ఎఫ్ 3 షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పండి?
ఎఫ్2 షూటింగ్‌లో కొంతమంది కొత్త. కానీ ఎఫ్3కి వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీగా ఉండేది. అన్నపూర్ణమ్మ, వై.విజయ గారు మా కోసం అప్పుడప్పుడు భోజనం తెచ్చేవాళ్ళు. అందరం బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూటింగ్ ప్రతి రోజు పండగలా ఉండేది.
ఎఫ్ 3 బడ్జెట్ పెరిగింది. రెమ్యునరేషన్ కూడా పెరిగింది. మీ వాటా ఎంత పెరిగింది?
సినిమా హిట్ కొడితే సాధారణంగానే రెమ్యునరేషన్ పెరుగుతుంది కదా. ఇందులో చెప్పడానికి ఏముంది(నవ్వుతూ..)
ఎఫ్ 3లో మీరు చాలా కొత్తగా ఉంటారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్తున్నారు? ఏమిటా కొత్తదనం ?
ఎఫ్ 3నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ఎఫ్ 2లో తెలంగాణ కుర్రాడిగా చేశా. ఎఫ్ 3కి వచ్చేసరికి స్పెషల‌్‌గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం ఉండే పాత్ర. కంటెంట్ కూడా చాలా బలంగా ఉంటుంది.
ఎఫ్2 కథకు కొనసాగింపుగా ఎఫ్ 3 ఉంటుందా ?
లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్‌లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ఎఫ్ 3లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్తకథని చెప్పాం.
ఎఫ్ 3లో నలుగురు హీరోయిన్స్‌తో పని చేశారు.. ఒకొక్కరి గురించి మీ అభిప్రాయం ఏమిటి ?
మెహరీన్, తమన్నాతో ముందే పని చేశాం. ఇందులో మెహరీన్, తమన్నా కోసం డిఫరెంట్ పాత్రలు డిజైన్ చేశారు. అలాగే పూజా హెగ్డే తో రెండు సినిమాలు చేశా. పూజా ఇందులో స్పెషల్ పార్టీ సాంగ్ చేస్తుంది. సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.
టికెట్ రేట్లు తగ్గించడం వలన అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారా ?
ఎఫ్ 3 ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తన్ని సినిమా తీసుకువెళ్ళాలంటే పెరిగిన ధరలు భారం కావచ్చు. అందుకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. కచ్చితంగా ఫ్యామిలీ అంతా కలసి ఎఫ్ 3ని థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.

 


యాక్షన్, రోమాన్స్, కామెడీ.. ఇలా చాలా జోనర్ సినిమాలు చేశారు కదా ,.. ఇందులో ఏది మీకు తృప్తినిచ్చింది?


అన్ని సినిమాలు, పాత్రలు తృప్తినిస్తాయి. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, .. ఇలా ఏ సినిమా చసిన వంద శాతం ఎఫర్ట్ పెడతా. నాది అనుకునే పని చేస్తా. ప్రతి సినిమా నచ్చే చేస్తాం కదా.


ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రాసెస్ కూడా మారింది కదా ?
ఇప్పుడు కథల ఎంపిక మారింది.  ఐతే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.
ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ?
ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ కూడ అయ్యారు. ''ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్'' అని సర్ ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా  రిజర్వ్డ్. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు.
పర్శనల్ గా మీకు ఏ జానర్ ఇష్టం?
అన్ని జానర్స్ చేయాలని ఉంటుంది. యాక్షన్ సినిమాలంటే చూడటం ఇష్టం.
దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటింది. ఆయన ఫ్యామిలీలో ఒకరిగా ఉంటారు. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రతి సెట్‌కి వెళ్తారు. సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చాలా ఫ్రెండ్లీ. ఎఫ్3 సెట్స్‌లో ఎక్కువగా శిరీష్ గారుండేవారు. శిరీష్ కూడా వండర్ ఫుల్ పర్సన్. ఎలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరిస్తారు. వారి బ్యానర్‌లో చేయడం గొప్ప అనుభవం.


సునీల్ గారి కాంబినేషన్ గురించి చెప్పండి?


కాలేజీలో ఉన్నపుడు సునీల్ గారికి ఫ్యాన్‌ని. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన హీరో అయిన తర్వాత  ఆయన టైమింగ్‌ని సరిగ్గా వాడుకోలేదమో అనిపించింది. మళ్ళీ వింటేజ్ సునీల్‌ని అనిల్ రావిపూడి చూపించబోతున్నారు ఎఫ్ 3లో.  సునీల్ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఆయన టైమింగ్ అద్భుతం. ఎఫ్ 3లో మా కాంబినేషన్ హిలేరియస్‌గా ఉంటుంది.
ఎఫ్ 3 లో కిడ్స్ గురించి స్పెషల్ ట్రాక్ ఉందని విన్నాం?
అవును. ఎఫ్ 3ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్‌కి ఎలాంటి సమస్య ఉందనే అంశంపై స్పెషల్‌గా ఒక ట్రాక్ డిజైన్ చేశారు. ఇది అద్భుతంగా ఉండబోతుంది.


పూజా హెగ్డేతో చేసిన స్పెషల్ సాంగ్ గురించి చెప్పండి?
చాలా మంచి పాట అది. ఐతే నాకు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ టెన్షనే. వెంకటేష్ గారికి కూడా అదే టెన్షన్. కానీ రాజుసుందరం మాస్టర్ చక్కగా డిజైన్ చేశారు. సాంగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం.
ఇప్పటివరకూ మీరు చేసిన చిత్రాలలో నచ్చిన పాత్ర ?
కంచె సినిమాలో చేసిన పాత్ర మోస్ట్ మెమరబుల్. తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ పాత్రలు కూడా ఇష్టం.
ఎఫ్ 4  ఉంటుందని దిల్ రాజు గారు, అనిల్ రావిపూడిగారు చెప్పారు. కథ మీరు విన్నారా ?
ఒక మూడు పాయింట్లు చెప్పారు. మూడూ హిలేరియస్‌గా ఉన్నాయి. ప్రస్తుతం మా దృష్టి ఎఫ్ 3 పైనే.
ప్రవీణ్ సత్తారు గారితో సినిమా ఎప్పుడు ?
ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది. పూర్తి యాక్షన్ సినిమా. లండన్‌లో 70రోజులు షూటింగ్. నాన్న గారు, బీవిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు.
డబ్బు గురించి ఫస్ట్రేషన్ అయిన సందర్భాలు ఉన్నాయా ?
చదువుకున్న రోజుల్లో ఉండేది. సినిమాకి వెళ్తా అంటే నాన్న యాభై రూపాయులు ఇచ్చే వారు. అది దేనికీ సరిపోయేది కాదు(నవ్వుతూ).. లక్కీగా మంచి ఫ్రెండ్స్ ఉండటం వల్ల సర్దుకునే వాళ్ళం.
డబ్బు పై మీ ఆలోచన?
కొంతమందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా అనిపిస్తుంది. ఐతే అంత ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా పోతుంది. ఎఫ్3లో కూడా అదే చెప్పాం. డబ్బు పట్ల జాగ్రత్తగా ఉండాలి.


లబ్ డబ్ సాంగ్‌లో చాలా గెటప్స్‌లో కనిపించారు? గెటప్స్‌ని ఎంజాయ్ చేశారా?


సినిమాలో చాలా గెటప్స్ వేయించారు. పోలీసు, పూజారి, రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్ ఇలా చాలా గెటప్స్ వేశాం. అన్నీ చాలా సరదాగ వచ్చాయి.


మెగా ఫ్యామిలీతో మెగా మల్టీ స్టారర్ ఎప్పుడు?


మాకు చేయాలనే ఉంటుంది. అయితే అది మా చేతిల్లో లేదు. సరైన స్క్రిప్ట్ కుదరాలి కదా.
మెగా ఫ్యామిలీ' ట్రైలర్  డైలాగ్ కి మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?
పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్‌ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.


సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారు ?


చాలా బావున్నాడు. మేము ఇద్దరం కలసి జిమ్‌కి వెళ్తున్నాం. నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.